twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ముగిసిన 19వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం (ఫోటోస్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: 19వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. హైదరాబాద్‌ లలితా కళా తోరణంలో జరిగిన ఈ ముగింపు వేడుకలకు తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సిఎఫ్‌ఎస్‌ఐ ఛైర్మన్‌ ముఖేష్‌ ఖన్నా, సిఇఓ శ్రవణ్‌ కుమార్‌, జ్యూరీ సభ్యులు, అధిక సంఖ్యలో చిన్నారులు హాజరయ్యారు.

    ఈ సందర్భంగా గవర్నర్‌ నరసింహన్‌ మాట్లాడుతూ పిల్లల్లో ఉన్న సృజనాత్మకత సినిమా నిర్మాణంలో కనిపించిందని, లిటిల్‌ డైరెక్టర్లకు అభినందనలు తెలిపారు.సైకిల్‌ దొంగ సినిమా దర్శకులు మౌళికి దొంగ దొరికాడో లేడో కానీ, మా మనస్సులు దోచుకున్నాడన్నారు. రెండేళ్ళ తరువాత జరిగే 20వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలకు హైదరాబాద్‌ పునఃస్వాగతం పలుకుతుందని గవర్నర్‌ తెలిపారు.

    అనంతరం వివిధ విభాగాల్లో ఉత్తమ చిత్రాల దర్శకులకు గవర్నర్‌ అవార్డులను ప్రధానం చేశారు. లైవ్‌ యాక్షన్‌ - అడల్ట్‌ జ్యూరీ, లైవ్‌ యాక్షన్‌ - చైల్డ్ జ్యూరీ విభాగాల ఇలా రెండు విభాగాలుగా అవార్డులు అందజేసారు. అవార్డులకు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో...

    ఉత్తమ చిత్రం (లైవ్‌ యాక్షన్‌ - అడల్ట్‌ జ్యూరీ)

    ఉత్తమ చిత్రం (లైవ్‌ యాక్షన్‌ - అడల్ట్‌ జ్యూరీ)

    ‘ సెలెస్టియల్‌ కామెల్‌' అనే రష్యా చిత్రం ఉత్తమ చిత్రంగా ఎంపికైంది.

    ఉత్తమ ద్వితీయ చిత్రం (లైవ్‌ యాక్షన్‌ - అడల్ట్‌ జ్యూరీ)

    ఉత్తమ ద్వితీయ చిత్రం (లైవ్‌ యాక్షన్‌ - అడల్ట్‌ జ్యూరీ)

    ద్వితీయ ఉత్తమ చిత్రంగా ‘లాబిరింధస్‌' అనే నెదర్లాండ్స్‌ చిత్రం ఎంపికైంది.

    ఉత్తమ స్క్రీన్‌ ప్లే (లైవ్‌ యాక్షన్‌ - అడల్ట్‌ జ్యూరీ)

    ఉత్తమ స్క్రీన్‌ ప్లే (లైవ్‌ యాక్షన్‌ - అడల్ట్‌ జ్యూరీ)

    ‘కోడెం' అనే నెదర్లాండ్స్‌ మూవీ ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డుకు ఎంపికైంది.

    ఉత్తమ దర్శకుడు (లైవ్‌ యాక్షన్‌ - అడల్ట్‌ జ్యూరీ)

    ఉత్తమ దర్శకుడు (లైవ్‌ యాక్షన్‌ - అడల్ట్‌ జ్యూరీ)

    ఉత్తమ దర్శకుడిగా రష్యన్ చిత్ర దర్శకుడు ఫెటింగ్‌ (సెలెస్టియల్‌ కామెల్‌) ఎంపికయ్యాడు.

    ఉత్తమ నటుడు (లైవ్‌ యాక్షన్‌ - అడల్ట్‌ జ్యూరీ)

    ఉత్తమ నటుడు (లైవ్‌ యాక్షన్‌ - అడల్ట్‌ జ్యూరీ)

    ఉత్తమ నటుడు గా హెటల్‌ గడ (రెయిన్‌బో - ఇండియా) ఎంపికయ్యాడు.

    ఉత్తమ షార్ట్ ఫిల్మ్ (లైవ్‌ యాక్షన్‌ - అడల్ట్‌ జ్యూరీ)

    ఉత్తమ షార్ట్ ఫిల్మ్ (లైవ్‌ యాక్షన్‌ - అడల్ట్‌ జ్యూరీ)

    ఉత్తమ షార్ట్‌ ఫిల్మ్‌ కేటగిరీలో ఎల్లో ఫెష్టివల్‌ (ఇండియా), ఎంపికైంది.

    ఉత్తమ చిత్రం (లైవ్‌ యాక్షన్‌ - చైల్డ్ జ్యూరీ)

    ఉత్తమ చిత్రం (లైవ్‌ యాక్షన్‌ - చైల్డ్ జ్యూరీ)

    లాబిరింధస్‌ అనే బెల్జియం చిత్రం ఎంపికైంది.

    ఉత్తమ షార్ట్‌ ఫిల్మ్‌ (లైవ్‌ యాక్షన్‌ - చైల్డ్ జ్యూరీ)

    ఉత్తమ షార్ట్‌ ఫిల్మ్‌ (లైవ్‌ యాక్షన్‌ - చైల్డ్ జ్యూరీ)

    మాట్‌లైడ్‌ అనే ఇటలీ చిత్రం ఎంపికైంది.

    English summary
    Amidst a scintillating performance by the children, the 19th International Children’s Film Festival of India (ICFFI) drew to a colourful end here on Friday. Speaking at the concluding ceremony, Governor ESL Narasimhan said that the festival has provided an opportunity to the children to expose their creativity.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X