సినిమా చూడండి...నేను హామీ ముఖ్యమంత్రి ప్రకటన
ఓ ముఖ్యమంత్రి స్వయంగా ఓ చిత్ర ప్రదర్శన విషయంలో కలగచేసుకుని హామీ ఇవ్వటం ఇదే మొదటసారి అంటున్నారు. తాజాగా ఈ సంఘనటన షారుక్‌ఖాన్ చిత్రం 'మై నేమ్ ఈజ్ ఖాన్' కు సంభవించింది. ఈ చిత్ర ప్రదర్శనను ఎవ్వరూ అడ్డుకోకుండా భద్రతకల్పిస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌చవాన్ ప్రకటన చేసారు. శివసేన హెచ్చరికల్ని లెక్క చేయకుండా నిశ్చితంగా వెళ్లి చిత్రాన్ని తిలకించాలని ప్రజల్ని కోరారు. తాను కూడా సినిమా చూస్తానన్నారు. అలాగే షారుక్ ఖాన్, శివసేన తమ వివాదాల్ని పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. అయితే చిత్ర ప్రదర్శనను అడ్డుకుంటామని శివసేన ప్రకటించింది. శివసైనికులకు భయపడి ముంబయి, పుణెల్లో ముందస్తు టిక్కెట్ల విక్రయాల్ని మల్టీప్లెక్స్‌లు నిలిపివేశాయి. మరో ప్రక్క చిత్రం విడుదలకు సమస్యలు తలెత్తకుండా ముంబయి పోలీసులు వెయ్యి మందికి పైగా శివసైనికుల్ని అదుపులోకి తీసుకున్నారు.


Click it and Unblock the Notifications











