twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేరస్థుడికి కొందరు హీరోలు సరెండర్.. నాగార్జున, జగన్ భేటీపై సీఎం హాట్ కామెంట్స్!

    |

    రాజకీయాల్లో సినీ తారల ప్రమేయం ఎప్పుడూ ఉండేదే. ఎన్నికలు సమీపించిన తరుణంలో ఈ హడావిడి ఇంకాస్త ఎక్కువగా కనిపిస్తుంది. చాలా మంది సినీ తారలు వారికి నచ్చిన రాజకీయ పార్టీలకు మద్దత్తు తెలపడం చూస్తూనే ఉన్నాం. తాజాగా స్టార్ హీరో కింగ్ నాగార్జున పొలిటికల్ ఎంట్రీ గురించిన వార్తలు జోరందుకుంటున్నాయి. నాగార్జున మంగళవారం రోజు ఏపీ ప్రతి పక్ష నేత వైయస్ జగన్ తో భేటీ కావడం సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

    రాజకీయాల్లోకి నాగ్

    రాజకీయాల్లోకి నాగ్

    ఫిబ్రవరి 19న అక్కినేని నాగార్జున లోటస్ పాండ్ లో వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. దీని గురించి సమాచారం రాగానే నాగార్జున రాజకీయ ప్రవేశం అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. వైసిపి తరుపున ఎంపీ అభ్యర్థిగా నాగ్ బరిలో దిగబోతున్నట్లు ఊహాగానాలు జోరందుకున్నాయి. వీరిద్దరి భేటీపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు.

    హీరోలు సరెండర్

    హీరోలు సరెండర్

    నాగార్జున, జగన్ భేటీని ఉద్దేశిస్తూ చంద్రబాబు కామెంట్స్ చేశారు. నేరస్థులతో సినీతారల భేటీ దురదృష్టకరం. కొందరి హీరోలు నేరస్థుడికి సరెండర్ అవుతున్నారు. దీని వలన ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయి అని అన్నారు. పలు సందర్భాలలో సినీతారలు, రాజకీయ నాయకులు కలుసుకోవడం కొత్త కాదు. కానీ నాగార్జున గతంలో కూడా ప్రత్యేకంగా గుజరాత్ వెళ్లి నరేంద్ర మోడీని కలసిన సంగతి తెలిసిందే.

    స్నేహితుడు కాబట్టే

    స్నేహితుడు కాబట్టే

    జగన్ తో భేటీ గురించి వస్తున్న వార్తలపై నాగార్జున స్పందించినట్లు తెలుస్తోంది. జగన్ నాకు మంచి స్నేహితుడు. జగన్ విజయవంతంగా పాదయాత్ర పూర్తి చేశారు కాబట్టి అభినందించడానికి వెళ్ళాను అని చెప్పారట. తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని నాగ్ అన్నట్లు వార్తలు వస్తున్నాయి. కొందరైతే నాగార్జున గుంటూరు లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా బరిలోకి దిగుతారని ప్రచారం చేస్తున్నారు.

    చాలా రోజులుగా ఊహాగానాలు

    చాలా రోజులుగా ఊహాగానాలు

    నాగార్జున వైసిపిలో చేరుతున్నట్లు వస్తున్న ఈ వార్తలు కొత్తవి కాదు. గత రెండు మూడేళ్ళుగా ఇలాంటి వార్తలు వినిపిస్తున్నాయి. కానీ నాగార్జున అవేమి పట్టించుకోకుండా తన సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. నాగార్జున త్వరలో మన్మథుడు2 చిత్రంలో నటించబోతున్న సంగతి తెలిసిందే. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది.

    English summary
    CM Chandrababu made hot comments on YS Jagan and Nagarjuna meeting
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X