ముంబై హీరోయిన్‌తో అసభ్యంగా.. తొలిసారి స్పందించిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గత అధికారి పక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన ఎన్నో తప్పులు బయటపడుతున్నాయి. ఈ క్రమంలోనే కొందరు వైసీపీ నేతలు ముంబైకు చెందిన కాదంబరి జెత్వాని అనే హీరోయిన్‌తో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు చిత్రహింసలకు గురి చేసిన అంశం తెరపైకి వచ్చింది. దీంతో ఇప్పుడది పెద్ద వివాదంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ అంశంపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఆ పూర్తి వివరాలను మీరే చూసేయండి!
మిస్టరీగా మారిపోయిందిగా
ముంబైకు చెందిన నటి కాదంబరి జెత్వానిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు, అధికారులు చిత్రహింసలకు గురి చేశారు అన్న న్యూస్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అవుతోంది. వ్యక్తిగత కక్షతో ఆమెను కొందరు దారుణమైన రీతిలో ఇబ్బందులకు గురి చేశారు. అయితే, దీనిపై పూర్తి సమాచారం తెలియకపోవడంతో కొద్ది రోజులుగా ఈ న్యూస్ మిస్టరీగా మారిపోయింది.

కాదంబరి జెత్వాని టార్గెట్
తెలుగు న్యూస్ ఛానెళ్లలో తనపై వస్తున్న వార్తలపై తాజాగా నటి కాదంబరి జెత్వాని స్పందించారు. ఈ మేరకు తాజాగా ఆమె ఓ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తనను టార్గెట్ చేసి ఎంతగా చిత్రహింసలకు గురి చేశారో ఆమె వివరించారు. అంతేకాదు, తన కుటుంబాన్ని కూడా జైలులో పెట్టి హింసించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక్కొక్కటిగా వెలుగులోకి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. ప్రభుత్వ పెద్దలు, అధికారుల సహాయంతో తనను ఎలా టార్చర్ చేశారన్నది కాదంబరి జెత్వాని మీడియాకు తెలిపారు. వాట్సాప్‌లో నగ్నంగా కాల్స్ చేయడం, దొంగ డాక్యూమెంట్లు సృష్టించి అరెస్ట్ చేయించడం, నిజాన్ని చెబితే చంపేస్తామని బెదిరింపులకు దిగడం, మొత్తంగా ఆరు నెలలు నరకం చూపించడాన్ని జెత్వాని సవివరంగా తెలిపారు.

చంద్రబాబు స్పందిస్తూ
కాదంబరి జెత్వాని గురించి కొద్ది రోజులుగా తెలుగు న్యూస్ ఛానెళ్లలో వార్తలు సెన్సేషన్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి కొందరు ఈ విషయాన్ని తీసుకు వెళ్లారు. దీంతో ఆయన తొలిసారి జెత్వాని వివాదంపై స్పందించారు. ఇది చాలా హేయమైన చర్య అంటూ దీన్ని సీఎం ఖండించారు.
బాధగా అనిపిస్తుందని
ముంబై నటి కాదంబరి జెత్వాని వివాదంపై చంద్రబాబు మాట్లాడుతూ.. 'రోజు రోజుకూ ఆ స్టోరీలు వింటుంటే చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ల (వైసీపీ నేతలు) ప్రవర్తనలు, ఆ కథలు విన్నప్పుడు అసహ్యం అనిపించడం లేదా? నేను నా రాజకీయాల జీవితంలో ఇలాంటివి ఎప్పుడూ వినలేదు. రాజకీయాల్లో చిన్నది జరిగితేనే పెద్ద స్కాండల్‌లా చూసేవాళ్లం' అంటూ చెప్పుకొచ్చారు.
ప్రెసిడెంట్ మాట్లాడరు
సీఎం చంద్రబాబు కంటిన్యూ చేస్తూ.. 'ఇప్పుడు మాత్రం ఇలాంటి ఘటనలు సర్వసాధారణం అయిపోయాయి. కానీ, దీనిపై పార్టీ వాళ్లు కానీ, ప్రెసిడెంట్ కానీ మాట్లాడడు. మా వాళ్లు చిన్న పని చేశారని తెలిస్తే నా నిజాయితీ పోతుందని బాధేసింది. అలాంటిది ఇన్ని జరుగుతుంటే మాట్లాడరా? ఇలాగేనా పార్టీని నడిపేది? మనం ఆదర్శంగా ఉండగలమా' అని స్పందించారు.


Click it and Unblock the Notifications











