గొల్లపూడి మారుతీరావు మృతి: కేసీఆర్ సహా పలువురు ప్రముఖుల సంతాపం
ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావు (80) కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా గత కొంతకాలంగా చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలియడంతో టాలీవుడ్ సినీ లోకంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ మేరకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తమ తమ సంతాపం తెలియజేస్తున్నారు.

సీఎం కేసీఆర్ దిగ్భాంతి
గొల్లపూడి మారుతీరావు మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. తెలుగు సినిమా రంగానికి ఆయన చేసిన సేవలను ముఖ్యమంత్రి కొనియాడారు. తెలుగు సాహిత్యంపై ఆయన వ్రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు తెలుగు భాషాభివృద్ధికి దిశానిర్దేశనం చేశాయని ముఖ్యమంత్రి అన్నారు. మారుతీరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి అని కేసీఆర్ తెలిపారు.
ఎప్పటికీ గుర్తుండిపోతారు సర్: నాని
గొల్లపూడి మరణవార్త తెలిసి ట్విట్టర్ వేదికగా స్పందించారు నాని. గొల్లపూడి గారు తన ఫేవరేట్ యాక్టర్ అని పేర్కొన్నారు. ఆయన మాట్లాడే మాటలు, ఆయన నటన ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరైందని పేర్కొంటూ ఎప్పటికీ గుర్తుండిపోతారు సర్ అని చెప్పారు.
సుధీర్ వర్మ రెస్పాన్స్
గొల్లపూడి మారుతీ రావు మృతి పట్ల స్పందించిన డైరక్టర్ సుధీర్ వర్మ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.
ఈ విషయం తెలిసి షాకయ్యా: మంచు మనోజ్
''నటుడు, రైటర్ గొల్లపూడి మారుతీ రావు గారు మరణించారని తెలిసి షాక్ అయ్యా. మీరు ఎంతోమంది రైటర్లకు స్ఫూర్తిదాయకం. తెలుగు సినీ పరిశ్రమకు మీరు చేసిన సేవలు మరపురానివి. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా'' అని మంచు మనోజ్ పేర్కొన్నాడు.
ఈషా రెబ్బా స్పందన
గొల్లపూడి మరణంపై స్పందించిన ఈషా రెబ్బా.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంది.
Recommended Video
నిఖిల్
''హ్యాపీ డేస్ సినిమా కంటే ముందే ఓ సినిమా కోసం నటుడిగా, అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశా. ఆ సమయంలో ఆయనిచ్చిన సలహాలు, సూచనలు ఇప్పటికీ నా వెంటే ఉన్నాయి. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా'' అని నిఖిల్ ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications











