సింగర్ మృతి.. భౌతికకాయాన్ని చూసి సీఎం కేసీఆర్ కంటతడి
ప్రముఖ సింగర్, తెలంగాణ గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆయన మృతి.. తెలంగాణ ఉద్యమకారులను, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను, ఇతర కళాకారులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అటు సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ గాయకుడు సాయి చంద్ భౌతిక కాయాన్ని చూసి సీఎం కేసీఆర్ కంటతడి పెట్టారు. ఆ వివరాల్లోకి వెళితే...
గుండెపోటుతో మృతి: ప్రముఖ సింగర్ చైర్మన్ సాయి చంద్ హఠాన్మరణం చెందారు. అయితే బుధవారం ఆయన కుటుంబ సభ్యులతో బిజినేపల్లి మండలంలోని తన ఫామ్ హౌజ్ కు వెళ్లారు. అక్కడ రాత్రిపూట అస్వస్థతకు గురవ్వగా.. కుటుంబ సభ్యులు వెంటనే నాగర్ కర్నూల్ జిల్లాలోని ఆసుపత్రికి తరలించారు. అటు నుంచి హైదరాబాదులోని గచ్చిబౌలి కేర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ, సాయి చంద్ అప్పటి మరణించినట్టుగా ఆ వైద్యులు నిర్దారించారు. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలోని స్వగృహానికి సాయిచంద్ భౌతిక కాయాన్నితరలించారు.

భౌతికకాయానికి నివాళులు: సాయి చంద్ మృతితో బీఆర్ఎస్ నేతలతో పాటు, ఇతర కళకారులు తీవ్ర దిగ్భ్రాంతికి గురై అయ్యారు. మరోవైపు సాయి చంద్ మృతిపట్ల సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు, నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రగతి భవన్ నుంచి బయల్దేరిన సీఎం కేసీఆర్ మధ్యాహ్నం గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి చేరుకున్నారు. సాయి చంద్ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. అక్కడ సాయిచంద్ కుటుంబ సభ్యుల్ని పరామర్శి అండగా ఉంటామని హామీనిచ్చారు.

సీఎం కంటతడి: అక్కడ సీఎం కేసీఆర్ తో సాయిచంద్ భార్య చెప్పిన మాటలు కంటతడి పెట్టిస్తున్నాయి. సార్ సాయిని పిలువండి. లెమనండి..మీరు పిలిస్తే లేచివస్తాడు.. అంటూ సాయి భార్య కన్నీరు పెట్టింది. దగ్గరకు వచ్చి రోధిస్తున్న సాయిచంద్ తండ్రిని సీఎం అక్కున చేర్చుకొని ఓదార్చారు. నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. ఓదశలో సాయిచందర్ భౌతిక కాయాన్ని చూసి కేసీఆర్ కంటతడి పెట్టారు. తెలంగాణ సమాజం ఓ గొప్ప కళాకారుడిని కోల్పోయిందని భావోద్వేగం అయ్యారు.

ఉద్యమపాటలతో హుషారు: ఇక సాయిచంద్ తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నో ఉద్యమ పాటలు పాడారు. ఆయన వనపర్తి జిల్లా అమరచింతలో జన్మించారు. విద్యార్థి దశ నుంచి కళాకారుడు, గాయకుడిగా పేరు తెచ్చుకున్న సాయి చంద్.. . తెలంగాణ ఉద్యమ సమయంలో ధూంధాం పాటలతో ఉద్యమకారులను హోరెత్తించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కాలం నుంచి తన పాటలతో ప్రజల్లో చైతన్యం, పార్టీ నేతల్లో పోరాట స్పూర్తిని కలిగిస్తూ వచ్చాడు. ప్రస్తుతం సాయిచంద్ తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా ఉండగా.. హఠాన్మరణం చెందారు.


Click it and Unblock the Notifications











