తొలగిస్తామని సినీ నిర్మాతలకు సీఎం హామీ
సినీ పరిశ్రమను దెబ్బతీసేలా, నిర్మాతలకు గుదిబండలా మారిన విలువ ఆధారిత పన్ను(వ్యట్)ను తొలగించాలని కోరుతూ ఫిల్మ్ చాంబర్, నిర్మాతల మండలి ముఖ్యమంత్రిని కలిసి విన్నవించారు. దేశంలో మిగతా ఏ చిత్ర పరిశ్రమలో లేని విధంగా టాలీవుడ్లో గత ఏడేళ్లుగా వ్యాట్ విధిస్తున్నారని కిరణ్ కుమార్ రెడ్డికి వివరించారు.
దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం వ్యాట్ తొలగింపు హామీ ఇచ్చారని నిర్మాతలు తెలిపారు. నిర్మాతల మండలి సభ్యులు బుధవారం ఫిల్మ్ చాంబర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. ఇప్పటికే పరిశ్రమ నష్టాల్లో ఉందని, వాట్ వేయడం ద్వారా పరిశ్రమ మరింత కృంగిపోతుందని నిర్మాతలు చెప్పారు.
ప్రస్తుతం సినీ పరిశ్రమలో సంవత్సరానికి 100 సినిమాలు నిర్మాణం అయితే అందులో 10 నుంచి 15 సినిమాలు మాత్రమే సక్సెస్ సాధిస్తున్నాయి. కమర్షియల్ హిట్ల సంఖ్య 10కి మించడం లేదు. ఈ నేపథ్యంలో చాలా మంది నిర్మాతలు నష్టపోతూనే ఉన్నారు. ఇప్పటికే సినిమాలపై బెలెడు టాక్సులు ఉన్నాయి. కొత్తగా వ్యాట్ కూడా వేస్తే చిన్న నిర్మాతలు సినిమాలు నిర్మించే పరిస్థితి ఉండదు. మరి సీఎం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారో? లేదో? చూడాలి.


Click it and Unblock the Notifications











