twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమాల్లో ఫైటింగ్ సీన్లతో ఇబ్బంది: సీఎం రోశయ్య

    By Srikanya
    |

    ప్రతి ఐదు నిమిషాలకు చెవులు చిల్లులుపడేలా ఫైటింగ్ సీన్లు అదరగొడుతున్నాయి.పాత సినిమాల్లో ఇన్ని ఫైట్స్‌ ఉండేవి కాదు. ప్రస్తుత సినిమాల్లో సందేశాత్మక సన్నివేశాలకు బదులు, హింసను ప్రోత్సహించే సన్నివేశాలనే ఎక్కుగా చూపిస్తున్నారు అంటూ సీఎం రోశయ్య ఆందోళన వ్యక్తం చేశారు. జగపతి ఆర్ట్ పిక్చర్స్ స్థాపించి 50 ఏళ్లయిన సందర్భంగా వంశీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఏర్పాటుచేసిన స్వర్ణోత్సవంలో ఆయన ప్రసంగించారు. అలాగే..వర్ధమాన నటీనటులను చూస్తుంటే తనకు జాలి వేస్తుందన్నారు. ఎవరూ హీరోనో..ఎవరు హీరోయినో కూడా అర్థం కావడం లేదన్నారు.

    అలాగే పాతచిత్రాల్లో మంచి సందేశాలే కాకుండా పాటల్లో మంచి సాహిత్యం కూడా ఉండేదని, నాటి యువతరానికివి మార్గదర్శకంగా ఉండేవని ఆయన చెప్పారు. మంచి ఆలోచనలు, పరిజ్ఞానం పదిమందికి ఉపయోగపడేలా సమాజంలో ప్రేరణ కలగాలంటే కవుల రచనలు, సినిమాల ద్వారానే సాధ్యమని, నేతల ఉపన్యాసాల వల్ల కాదని రోశయ్య పేర్కొన్నారు. సి.నారాయణరెడ్డి అధ్యతన జరిగిన ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి రోశయ్య ముఖ్య అతిథిగా, కేంద్రమానవవరుల అభివృద్ధి శాఖ మంత్రి డి.పురందేశ్వరి అతిథిగా పాల్గొని, అన్నపూర్ణ చిత్ర దర్శకుడు వి.మధుసూదనరావు, దాదాసాహెబ్‌ పాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు, ప్రజానటి జమున రమణారావు, నటి వాణిశ్రీలకు జగపతి అపూర్వ సత్కారాలను అందజేశారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X