twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలుగు సినిమాలు అదరగొట్టాయి, ఉన్నత శిఖరాలు అందుకోవాలి: వైఎస్ జగన్

    |

    66వ నేషనల్ ఫిల్మ్అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. తెలుగు సినిమా ఇదే విధంగా ముందుకు సాగుతూ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన మహానటి, రంగస్థలం, అ!, చిలసౌ చిత్ర బృందాలకు అభినందనలు తెలిపారు.

    అవార్డుల విషయానికొస్తే... మహానటి చిత్రానికి గాను కీర్తి సురేశ్ ఉత్తమ నటి అవార్డు దక్కించుకుంది. రంగస్థలం చిత్రానికి ఉత్తమ ఆడియోగ్రఫీ రంగస్థలం అందించినందుకుగాను రాజా కృష్ణన్ అవార్డ్ సొంతం చేసుకున్నారు. చిలసౌ మూవీకి ఉత్తమ స్క్కీన్ ప్లే అందించినందుకుగాను దర్శకుడు రాహుల్ రవీంద్రన్ అవార్డ్ అందుకోబోతున్నాడు.

     CM YS Jagan congratulates the National Film Awards winners

    కాస్టూమ్, మేకప్ విభాగాల్లో సైతం తెలుగు చిత్రాలు మేటిగా నిలిచాయి. ఉత్తమ మేకప్ అవార్డ్ 'ఆ!' చిత్రానికి దక్కింది. ఉత్తమ కాస్ట్యూమ్స్ డిజైనర్ అవార్డ్ మహానటి చిత్రం అందుకుంది. దీంతో పాటు జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా మహానటి నిలిచింది.

    విజేతలకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే చిరంజీవి, పవన్ కళ్యాణ్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు ట్వీట్లు చేశారు. చాలా రోజుల తర్వాత తెలుగు సినిమాలు ఎక్కువ సంఖ్యలో అవార్డులు దక్కించుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవతుతోంది.

    English summary
    CM YS Jagan congratulates the National Film Awards winners. On this occasion he congratulated the Mahanati, Rangasthalam, A!, Chi La sow teams.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X