రాంబాబు ‘పవర్’ ఫుల్ ట్రైలర్స్ 26న
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మించే చిత్రం చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'. పవన్ సరసన తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇటీవల విడుదలైన ఈచిత్రం ఆడియో ప్రోమోలకు మంచి స్పందన వస్తోంది. ఆడియో వేడుక జరుపకుండా నేరుగా మార్కెట్లోకి పాటలను రిలీజ్ చేయనున్నారు.
కాగా... 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రానికి సంబంధించిన మరో రెండు పవర్ ఫుల్ ట్రైలర్స్, ఆడియో సెప్టెంబర్ 26న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన రాగా...రేపు విడుదల కాబోయే ట్రైలర్ తో సినిమా అంచనాలు ఆకాశాన్నంటుతాయని అంటున్నారు.
పంజా, గబ్బర్ సింగ్ ఆడియో వేడుకల సందర్భంగా భారీగా అభిమానులు తరలి రావడంతో చోటు సరిపోక చాలా మంది బయటే ఉండి పోయారు. క్రౌడ్‌ను కంట్రోల్ చేయడానికి పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో పలువురు అభిమానులు గాయపడ్డారు. ట్రాఫిక్ జామ్‌తో అనేక మంది ఇబ్బంది పడ్డారు. ఇలాంటి ఘటనలు మళ్లీ చోటు చేసుకూడదని, తన వల్ల, తన సినిమా వల్ల ఇంత మంది ఇబ్బంది పడటం ఇష్టం లేకనే పవన్ కళ్యాణ్ ఆడియో వేడుకకు నో చెప్పినట్లు తెలస్తోంది.
తమన్నా, గేబ్రియల్, ప్రకాష్‌రాజ్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం తదితరులు నటిస్తున్న. ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్, శేఖర్, ఫైట్స్: విజయ్, స్టిల్స్: మాగంటి సాయి, కో డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్, నిర్మాణం యూనివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డివివి దానయ్య, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











