కోకోకోకిల.... నయనతార మూవీ ట్రైలర్ అదిరిపోయింది
నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కిన తమిళ చిత్రం 'కొలమావు కోకిల'...... తెలుగులో 'కోకోకోకిల'గా విడుదల కాబోతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు. డ్రగ్స్ రవాణా నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది.

నెల్సన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్నారు. లుక్ పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా నయనతార విభిన్నంగా కనిపించబోతోంది. నయనతారను ప్రేమించే పాత్రలో కమెడియన్ యోగిబాబు నటించాడు. ఈ ఇద్దరిపై ఓ పాటను కూడా చిత్రీకరించడం విశేషం.
ట్రైలర్ చూస్తుంటే సినిమా సహజత్వానికి దగ్గరగా వినోదం పంచుతూ సస్పెన్స్ రేకెత్తిస్తూ ఉందని తెలుస్తోంది. ఇప్పటి వరకు నయనతార నుండి డోరా, కర్తవ్యం లాంటి పలు విభిన్నమైన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చూశాం. ఇదే తరహాలో ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
అనిరుధ్ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రం ఆగస్టు 17న సినిమాను ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళంలో ఒకేసారి ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











