twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మైండ్ గేమ్ ‘కాఫీబార్’

    By Staff
    |

    మంచి సందేశంతో సినిమా తీస్తే దాన్ని కళాత్తక చిత్రం అనే రోజులివి. పుష్కలమైన వాణిజ్య విలువలతో మంచి సందేశాన్ని జోడించి యువతను అలోచింపజేసేలా సినిమా తేస్తే అది 'కాఫీబార్" అవుతుంది...అని అంటున్నారు గీతాకృష్ణ. గీతాకృష్ణ స్వీయ దర్శకత్వంలో 'బ్లూఫాక్స్‌సినిమా పతాకంపై శశాంక్‌, బియాంక దేశ్వాయ్, అతుల్‌కులకర్ణి, సుమన్‌, గిరీష్‌ కర్నాడ్‌, బేబి శివాని ప్రధాన పాత్రల్లో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రూపొందుతున్న చిత్రం 'కాఫీబార్‌. ష్యూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్‌ప్రొడక్షన్‌ జరుపుకుంటోంది.

    గతంలో 'కోకిల, 'సంకీర్తన, 'కీచురాళ్ళు లాంటి వైవిధ్యమైన చిత్రాలను నిర్మించి క్రియేటివ్‌ దర్శకునిగా పేరుతెచ్చుకున్న గీతాకృష్ణ 'కాఫీబార్‌పై ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తినెలకొంది. 'అర్థవంతమైన సందేశంతో వాణిజ్య విలువలున్న సినిమా ఇది. కళాత్మక చిత్రానికి కమర్షియల్‌ హంగులు జోడిస్తే ఆ సినిమా ఎలా ఉంటుందో 'కాఫీబార్‌ చూస్తే తెలుస్తుంది అని దర్శక, నిర్మాత గీతాకృష్ణ చెప్పారు. 'భిన్న మనస్తత్వాలు, ఆలోచనలు కలిగిన యువతీయువకుల నేపథ్యంలో ఈ చిత్ర కథాంశం ఉంటుంది. మైండ్‌గేమ్‌ ప్రధానంగా ఉంటుంది. ఇది యువతలో తప్పకుండా కొత్త ఊపును తెస్తుంది. మనం ఇలా ఎందుకు ఉండకూడరు? ఉండట్లేదు? అనే లోచనను వాళ్లకు కలిగిస్తుంది. ఇది కళాత్తమక చిత్రం కాదు. ఈ సినిమాను అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తున్నాం. త్వరలోనే ట్రైలర్స్‌ను, ఆడియోను విడుదల చేస్తాం అని ఆయన అన్నారు. ఈ చిత్రానికి గీతాకృష్ణ స్వీయ సంగీతాన్ని అందిస్తున్నారు. అతుల్ కులకర్ణ, బేబీ శివానీ ప్రధాన పాత్రధారులు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X