ఐశ్వర్య రాయ్ ఇంటికి ఆస్కార్ ఉత్తమ నటుడు అవార్డు విజేత
మొన్న ప్రకటించిన ఆస్కార్ అవార్డులలో ఉత్తమ నటుడిగా కోలిన్ ఫర్త్‌కి పురస్కారం దక్కిన విషయం తెలిసిందే. ది కింగ్స్ స్వీచ్ చిత్రానికి గానూ ఆయన ఈ అవార్డు అందుకున్నారు. అందులో ఆయన .నత్తి ఉన్న జార్జ్-6 గా కనిపిస్తారు. తన నత్తి సమస్యను అధిగమించడానికి చేసిన ప్రయత్నమే ఈ చిత్రకథ. ఆస్ట్రేలియన్ స్పీచ్ థెరపిస్టు సాయంతో ఆయన ఎలా తన మాటను పునరుద్ధరించుకున్నాడో తెలిపే కథాంశాన్ని హృద్యంగా తెరకెక్కించారు దర్శకుడు టామ్ హూపర్.
ఇక ఈయనకు ఐస్వర్యారాయ్ కూ ఉన్న రిలేషన్ ఏమిటంటే...ఐశ్వర్య నటించిన 'ది లాస్ట్ లీజియన్' చిత్రంలో ఆయన నటించారు. దాంతో ఆస్కార్ వేడుకల్లో పాల్గొన్న ఐశ్వర్య..ఉత్తమ నటుడిగా కోలిన్‌ను ఎంపిక చేయగానే ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసింది. తరవాత జరిగిన పార్టీలో పాల్గొన్న ఐశ్వర్య ఆయనకు విషెష్ చెప్పడంతోపాటు తమ ఆతిథ్యం స్వీకరించడానికి భారతదేశానికి రావాలని ఆహ్వానించింది. అందుకు ఆయన సరేనన్నారు. త్వరలోనే కోలిన్ మన దేశానికి వస్తారని సమాచారం.


Click it and Unblock the Notifications











