భూమిక సినిమా పైరసీకి గూగుల్ పై కేసు...
ప్రకాష్ రాజ్, భూమిక కలిసి నటించిన చిత్రం 'కలెక్టర్‌గారి భార్య' పాటలు రిలీజ్ కాకుండానే నెట్ లో రిలీజ్ అయ్యాయి. దాంతో దర్శకుడు టేకుల కృపాకర్ రెడ్డి టైమ్స్ మ్యూజిక్ వారు పైరసీ చేసినట్లు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని తెలియచేస్తూ మీడియా సమావేశం నిర్వహించారు. శనివారం ఉదయం కృపాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ "కలెక్టర్ గారి భార్య సినిమా పాటలను డిజిటల్ లింక్ కోసం ముంబయికి తీసుకెళతానని టైమ్స్ మ్యూజిక్ ప్రతినిధి సత్యదేవ్ నన్ను అడిగారు. దాని కోసం పాటల మాస్టర్ సీడీ కావాలని అడిగితే ఇచ్చాను. కేవలం డిజిటల్ లింక్ కు తప్పా వేరే విధంగా మాస్టర్ సీడీని వాడుకోవద్దని కూడా చెప్పాను. 2010 ఏప్రిల్ 8వ తేదీన రాగా డాట్ కామ్ లో మా చిత్రానికి సంబంధించిన పాటలు ఉన్నాయని తెలిసి షాక్‌కి గురయ్యాను. దీంతోపాటు పలు వెబ్ సైట్లలో పాటలు ఉంచారు. మా సినిమా పాటలను పైరసీ చేసినందుకు, నమ్మించి మోసం చేసినందుకు టైమ్స్ మ్యూజిక్, రాగా డాట్ కామ్, గూగుల్ తోపాటు మరికొన్ని వెబ్ సైట్లపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టామన్నారు.


Click it and Unblock the Notifications











