ఎన్టీఆర్ తప్ప ఎవ్వరూ గుర్తురారు.. కష్టమొస్తే ముందుండేది ఆయనే.. యంగ్ హీరో కామెంట్స్

యంగ్ హీరో, ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొచ్చాడు. 'కాలేజ్ కుమార్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మీడియాతో ముచ్చటించిన ఆయన.. తమ కుటుంబానికి బాగా కావాల్సిన వ్యక్తి ఎన్టీఆర్ మాత్రమే అని చెప్పాడు. వివరాల్లోకి పోతే..

ఏ కష్టమొచ్చినా ఎన్టీఆరే..

ఏ కష్టమొచ్చినా ఎన్టీఆరే..

తమకు ఏ కష్టమొచ్చినా ఎన్టీఆరే ముందుంటారని ఇప్పటికే రాహుల్ విజయ్ చాలాసార్లు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి తారక్‌పై అభిమానాన్ని చాటుకుంటూ మాట్లాడాడు రాహుల్. నటన విషయంలో తనకు స్ఫూర్తి ఎన్టీఆర్ మాత్రమే అని ఆయన చెప్పాడు.

తారక్ ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకం

తారక్ ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకం

ఇష్టమైన యాక్టర్ ఎవరు? అంటే తారక్ అన్న తప్ప మైండ్‌లోకి ఎవ్వరూ రారని రాహుల్ చెప్పాడు. ఇకపోతే రజినీకాంత్ అభిమానినని, చిన్నప్పటి నుంచే తనకు రజినీ స్టైల్ అంటే చాలా ఇష్టమని అన్నాడు. తెలుగు ఇండస్ట్రీలో వ్యక్తిగతంగా తారక్ అన్న అంటే చాలా ఇష్టమని, ఎన్టీఆర్ నటుడిగా ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకమని అన్నాడు రాహుల్.

ఈ మాయ పేరేమిటో అంటూ కాలేజ్ కుమార్

ఈ మాయ పేరేమిటో అంటూ కాలేజ్ కుమార్

‘ఈ మాయ పేరేమిటో' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రాహుల్ విజయ్.. ఆ తర్వాత ‘సూర్యకాంతం' సినిమాలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఇప్పుడు హీరోగా నిరూపించుకోవాలని ‘కాలేజ్ కుమార్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. నేడు (మార్చి 6) ఈ సినిమా విడుదలయింది.

కాలేజ్ కుమార్.. మళ్ళీ అతనే!

కాలేజ్ కుమార్.. మళ్ళీ అతనే!

కన్నడలో సూపర్ హిట్ సాధించిన కాలేజ్ కుమార్ సినిమాను తెలుగులో అదే పేరుతో రీమేక్ చేశారు. మాతృకకు దర్శకత్వం వహించిన హరి సంతోష్ ఈ రీమేక్‌కి కూడా దర్శకత్వం వహించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఎమ్.ఆర్. పిక్చర్స్ పతాకంపై లక్ష్మణ్ గౌడ సమర్పణలో ఎల్. పద్మనాభ నిర్మించిన ఈ సినిమాలో రాహుల్ విజయ్ సరసన ప్రియ వడ్లమాని హీరోయిన్‌గా నటించింది.

సరదాగా షూటింగ్.. మధుబాల, రాజేంద్రప్రసాద్

సరదాగా షూటింగ్.. మధుబాల, రాజేంద్రప్రసాద్

ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషించిన మధుబాల, నాజర్, రాజేంద్రప్రసాద్ లాంటి నటులతో పని చేయడం సంతోషంగా ఉందని రాహుల్ విజయ్ చెప్పాడు. వారి దగ్గర చాలా నేర్చుకున్నానని, సినిమా షూటింగ్ అంతా చాలా సరదాగా జరిగిందని ఆయన చెప్పాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X