ఆమెతో సెక్స్ చేశావా? కాళ్లు పట్టుకున్నావా? వర్మ మొహం మీదే అడిగిన కాలేజీ అమ్మాయి!
Recommended Video

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' పేరుతో ఓ షార్ట్ ఫిల్మ్ తీస్తున్న సంగతి తెలిసిందే. అమెరికన్ పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో రూపొందించిన ఈ చిత్రం ట్రైలర్ ఇటీవల విడుదల చేయగా దేశ వ్యాప్తంగా దీనిపై హాట్ టాపిక్ నడుస్తోంది. వర్మ తీసిన ఈ నగ్న చిత్రంపై ఓ టీవీ ఛానల్ వారు చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ చర్చలో కొందరు కాలేజీ అమ్మాయిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు వర్మను తమ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు.

పోర్న్‌స్టార్‌తో విదేశాల్లో ఎందుకు తీశారు?
పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' ఎందుకు తీశారు? ఇండియాలో ఎవరూ ఒప్పుకోలేదా? అనే ప్రశ్నకు వర్మ స్పందిస్తూ..... ‘ఇండియాలో నగ్నంగా నటించడానికి ఎవరూ ఒప్పుకోరు. పోర్న్ స్టార్ అయితేనే నేను అనుకున్నది తీయగలను అనే ఉద్దేశ్యంతో మియా మాల్కోవాను ఎన్నుకోవడం జరిగింది. ఇండియాలో ఇలాంటి సీన్లు తీయడానికి చట్టం ఒప్పుకోదు. అందుకే యూరఫ్‌లో ఈ ఫిల్మ్ చిత్రీకరించడం జరిగింది అని రామ్ గోపాల్ వర్మ తెలిపారు.

అక్కడ షూట్ చేసి ఇక్కడ చూపించవచ్చా?
యూరఫ్ లో షూట్ చేసి ఇండియాలో చూపించవచ్చా? అనే ప్రశ్నకు వర్మ బదులిస్తూ..... నేను నా ఫిల్మ్ డిజిటల్ వరల్డ్ లో, చూసే వారికి చూపిస్తున్నాను. డిజిటల్ వరల్డ్‌కు రీజియన్ తో సంబంధం లేదు. ఎవరు ఎక్కడి నుండైనా చూడవచ్చు అని వర్మ తెలిపారు.

నేరాలు జరిగితే పరిస్థితి ఏమిటి?
మీరు తీసిన ఈ నగ్న సినిమా వల్ల మగాడి మనసులో నేరపూరిత ఆలోచనలు కలిగి, ఏదైనా క్రైమ్ జరిగితే పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్నకు వర్మ స్పందిస్తూ.... హింస, సెక్స్ అనేది కొన్ని వందల ఏళ్ల నుండి ఉంది. అప్పటి నుండి ఇలాంటి నేరాలు జరుగుతున్నాయి. సినిమా వచ్చి వందేళ్లు కూడా కాలేదు. పోర్న్ వచ్చి 10 సంవత్సరాలు కూడా కాలేదు. దానికి దీనికి కనెక్షన్ పెట్టి మాట్లాడటం తగదు. రోడ్డు మీద ట్రాఫిక్ వల్ల యాక్సిడెంట్స్ అవుతున్నాయని ట్రాఫిక్ మొత్తం ఆపేయలేం కదా..... ఒక మనిషిలో నేర స్వభావం ఉంటే అతడు సినిమా చూడక పోయినా నేరాలకు పాల్పడతాడు అని వర్మ తెలిపారు.

మియా మాల్కోవాతో సెక్స్ చేశారా?
‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' సినిమా చేసే సమయంలో మియా మాల్కోవాతో సెక్స్ చేశారా? అంటూ ఓ కాలేజీ అమ్మాయి వర్మను మొహం మీదే అడిగేసింది. దీనికి వర్మక స్పందిస్తూ.... ఇది నా పర్సనల్ విషయమని, కానీ ఇలాంటి ప్రశ్న అడగటం నచ్చిందని వర్మ తెలిపారు.

ఆమెను దేవతలా చూస్తూ ఆమె అందాన్ని ఆరాధించాను
మియా మాల్కోవాను తాను ఒక అందాల దేవతలా ఆరాధించాను. భక్తుడిలా ఆమె అందాన్ని ఆరాధించాను. అంతే కాని ఆమెతో సెక్స్ చేయాలనే ఆలోచన ఎప్పుడూ చేయలేదు అని వర్మ వెల్లడించారు.

సెక్స్ కోసం ఎవరి కాళ్లైనా పట్టుకున్నారా?
మీరు ఎప్పుడైనా సెక్స్ కోసం ఏ అమ్మాయి కాళ్లైనా పట్టుకున్నారా? అనే ప్రశ్నకు వర్మ సాధానం చెబుతూ... తాను ఎప్పుడూ అలా చేయలేదని, అందుకోసం నా స్టైల్ ఆఫ్ వే ఉందని, ఎప్పుడూ సెక్స్ కోసం ఎవరి కాళ్లు పట్టుకోలేదని వర్మ తెలిపారు.


Click it and Unblock the Notifications











