సైలెంట్ గా టాలీవుడ్ డైరెక్టర్ లవ్ మ్యారేజ్.. ఫోటో వైరల్ కావడంతో అసలు విషయం..

తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. సెలబ్రిటీలు తమ బ్యాచ్లర్ లైఫ్ కు గుడ్ బాయ్ చెప్తూ వైవాహిక బంధం లోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే నాగచైతన్య శోభితాలు తమ ప్రేమ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకున్నారు. తాజాగా ఓ టాలీవుడ్ సక్సెస్ డైరెక్టర్, నటి సీక్రెట్ లవ్ మ్యారేజ్ చేసుకుని, వివాహ బంధంలోకి అడుగుపెట్టబెట్టాడు. ఇంతకీ ఆ సక్సెస్ డైరెక్టర్ ఎవరు?

ఈ స్టార్ డైరెక్టర్ ఎవరో కాదు.. 'కలర్‌ ఫొటో' డైరెక్టర్ సందీప్‌ రాజ్‌ (Sandeep Raj ).షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ ప్రారంభించారు సందీప్ రాజ్. ఆ తర్వాత 'హెడ్స్ అండ్ టేల్స్' అనే వెబ్ సిరీస్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే 'ముఖచిత్రం' అనే సినిమాకు కథ అందించారు .ఇక కలర్ ఫోటో సినిమాతో దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాకు ఉత్తమ తెలుగు చిత్రం విభాగంలో జాతీయ అవార్డు వచ్చింది.

Color Photo Director Sandeep Raj and chandini rao marriage in tirumala photos viral

దీంతో డైరెక్టర్ సందీప్ రాజ్ కు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఇండస్ట్రీలో మెగాస్టార్ వంటి స్టార్ హీరోలు కూడా ఈ చిత్రాన్ని చూసి మెచ్చుకున్నారు. ప్రస్తుతం సందీప్ రాజు కనకాల తనయుడు రోషన్ తో కలిసి మొగ్లీ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు . ఈ సినిమా 2025లో విడుదల కానుంది. దీంతోపాటు మాస్ మహారాజా రవితేజ హీరోగా ఓ సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నట్లు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. ఇదే కాకుండా మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

డైరెక్టర్ సందీప్ రాజ్, నటి చాందినీ రావు.. గతం కొన్ని రోజులుగా ప్రేమించుకుంటారు. వీరి ప్రేమకు పెద్దల అంగీకారంతో గత వారం రోజుల క్రితం నిశ్చితార్థం జరిగింది. తిరుమల వేదికగా శనివారం డైరెక్టర్ సందీప్ రాజ్, నటి చాందినీ రావు వివాహం ఘనంగా జరిగింది.

వీరి వివాహ వేడుకకు వైవా హర్ష, హీరో సుహాస్‌ తదితరులు హాజరై సందడి చేశారు. ప్రస్తుతం ఆ వీరి ఫోటోలు, వీడియోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. ఇక సందీప్ - చాందినీ వివాహ ఫోటోలు వైరల్ కావడంతో నెటిజన్లు విషెష్ తెలుపుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X