కలర్స్ స్వాతి ఆ మధ్యన తిరుపతిలో పెళ్ళి చేసుకుందంటూ రూమర్స్ వచ్చాయి. అలాగే పెళ్లి కొడుకు దుబాయి లో బిజెనెస్ మేన్ అనీ, అతని పేరు శ్రీకాంత్ అని ప్రచారంలోకి వచ్చింది. దానిపై ఆమె స్పందిస్తూ..ఎవరు ఇటువంటి రూమర్స్ పుట్టిస్తున్నారో..వారికేం ఒరుగుతుందో నాకు తెలియదు..నేను పెళ్ళి చేసుకుంటే అందర్ని పిలిచి పెద్దల సమక్షంలో చేసుకుంటాను. అంతేగానీ దొంగచాటుగా చేసుకోవాల్సిన అవసరం లేదు అని మండిపడింది. ఇక ప్రస్తుంతం ఆమె "కలవరమాయే మదిలో", అనంతపురం 1980 వంటి సినిమాల్లో నటించింది. అనంతపురం 1980 ఈ వారమే రిలీజుకు సిద్దంమవుతోంది. తమిళంలో రిలీజై హిట్టియిన సుబ్రమణ్యంపురం చిత్రానికి ఇది డబ్బింగ్ వెర్షన్. ప్రస్తుతం టాలీవుడ్‌లోనే కాకుండా కోలీవుడ్‌లోనూ సినిమాలో బిజీ అయిన ఈ భామకు ఛాన్సులు బాగానే వస్తున్నాయని ఇండస్ట్రీలో టాక్. అలాగే ఆమె తనకు నచ్చిన రోల్: అష్టాచమ్మాలోని తన పాత్ర అనీ నచ్చిన సినిమా: సీతారామయ్య గారి మనుమరాలు అని చెప్పుకొచ్చింది.