కలర్స్ స్వాతి పెళ్లి ఆ బిజినెస్ మ్యాన్‌తో? (ఫోటో ఫీచర్)

By Bojja Kumar

హైదరాబాద్: టివి యాంకర్‌ కెరీర్ మొదలు పెట్టి సినిమా హీరోయిన్‌గా ఎదిగిన కలర్స్ స్వాతి అలియాస్ స్వాతి రెడ్డి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చెన్నైకి చెందిన ఓ వ్యాపారితో ఆమె పెళ్లి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇరుకుటుంబాల అనుమతితోనే ఈ వివాహం జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయం అఫీషియల్ గా ఖరారుకావాల్సి ఉంది. ప్రస్తుతం స్వాతి తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో నటిస్తోంది.

టెలివిజన్‌ షో కలర్స్‌ ద్వారా పేరుతెచ్చుకున్న ఆమెను కలర్స్‌ స్వాతిగా పిలవడం ప్రారంభించారు. కలర్స్‌ షో మా టివిలో ప్రసారమైంది. ఇక యాంకరింగ్‌లో రాణించిన అనంతరం ఆమె సినిమాల్లో సహాయ నటిగా చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత 2008లో తమిళ చిత్రం సుబ్రమణ్యపురమ్‌లో హీరోయిన్‌గా చేసి పేరుతెచ్చుకున్నారు. తెలుగులో అష్టాచమ్మా చిత్రం ఆమెకు ఎంతో పేరు తీసుకువచ్చిపెట్టింది.

కలర్స్ స్వాతి గురించిన మరిన్ని వివరాలు స్లైడ్ షోలో...

అష్టాచెమ్మా చిత్రానికి ఫిల్మ్ ఫేర్ అవార్డు

అష్టాచెమ్మా చిత్రానికి ఫిల్మ్ ఫేర్ అవార్డు

అష్టాచమ్మా చిత్రం ఆమెకు ఎంతో పేరు తీసుకువచ్చిపెట్టింది. ఈ చిత్రానికిగాను ఆమె ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు, నంది అవార్డును దక్కించుకోవడం విశేషం.

పుట్టింది రష్యాలో...

పుట్టింది రష్యాలో...

ఇక స్వాతి పుట్టింది ఒకప్పటి సోవియట్‌ యూనియన్‌ రష్యాలోని వ్లాదివొస్తొక్‌లో. ఆమె తండ్రి ఇండియన్‌ నేవీలో పనిచేసేవారు. ఉద్యోగరీత్యా ఆయన సోవియట్‌ యూనియన్‌ రష్యాకు సబ్‌మెరైనర్‌గా బదిలీ అయ్యారు.

రష్యా టు వైజాగ్

రష్యా టు వైజాగ్

ఆ తర్వాత వారి కుటుంబం విశాఖపట్నంకు వచ్చింది. స్వాతి చిన్నతనమంతా వైజాగ్‌లోనే గడిచింది.

హైదరాబాద్‌లో...

హైదరాబాద్‌లో...

వారి కుటుంబం హైదరాబాద్‌కు మకాం మార్చిన అనంతరం ఆమె యూసుఫ్‌గూడాలోని సెయింట్‌ మేరీస్‌ కాలేజీలో చదువుకున్నారు. బయోటెక్నాలజీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు.

టీవీ యాంకర్‌గా

టీవీ యాంకర్‌గా

17 సంవత్సరాల వయసులో టివి రంగంలోకి యాంకర్‌గా రంగప్రవేశం చేశారు. మా టివిలో కలర్స్‌ కార్యక్రమానికి హోస్ట్‌గా చేసి మంచి పేరుతెచ్చుకున్నారు.

చలాకీగా...

చలాకీగా...

హుషారెత్తించే వ్యాఖ్యానంతో ఈ కార్యక్రమాన్ని రక్తికట్టించారు. దీంతో మంచిరేటింగ్‌ సంపాదించిన ఈ షో ప్రైమ్‌టైమ్‌ స్లాట్‌లో ప్రసారమైంది. 150 ఎపిసోడ్‌లకు స్వాతి యాంకరింగ్‌ చేయడం విశేషం.

మల్టీ టాలెంట్

మల్టీ టాలెంట్

ఇక సినిమాల్లో నటిగానే కాకుండా డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా, ప్లే బ్యాక్‌ సింగర్‌గా కూడా చేశారు. 2008లో జల్సా చిత్రం హీరోయిన్‌ ఇలియానా డిక్రూజ్‌కు స్వాతి డబ్బింగ్‌ చెప్పారు. 2011లో ప్లేబ్యాక్‌ సింగర్‌గా పాడడం ప్రారంభించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X