అష్టాచెమ్మా ఆడనున్న కలర్స్ స్వాతి!
జాతీయ అవార్డు గ్రహీత ఇంద్రగంటి మోహన్ కృష్ణ మరో సినిమా తీయడానికి సిద్ధమయ్యాడు. ఆ సినిమా పేరు అష్టచెమ్మ. కలర్స్ స్వాతి ఈ సినిమాలో హీరోయిన్ గా చేయనున్నది. హీరోగా కొత్త యువకుడు చేయనున్నాడు. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ మాజీ ఉద్యోగి రామ్మోహన్ రావు నిర్మిస్తున్నాడు. కళ్యాణ్ మాలిక్ సంగీతాన్ని అందించనున్నారు. డేంజర్ సినిమాతో వెండితెరకు పరిచయమైన స్వాతి ఆ తరువాత ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో కూడా చేసింది.


Click it and Unblock the Notifications











