కలర్స్ స్వాతి పెళ్లి కబురు.. చూడ ముచ్చటైన జంట, వరుడు ఎవరంటే!
Recommended Video

కలర్స్ స్వాతి తెలుగువారందరికీ గుర్తుండిపోయే హీరోయిన్. స్వామిరారా, అష్టాచమ్మా, కార్తికేయ వంటి చిత్రాలతో స్వాతి గుర్తింపు తెచ్చుకుంది. స్వాతి గ్లామర్ పాత్రలకు దూరంగా ఉన్నా హావభావాలని అందంగా పలికిచగల నటి. స్వాతి ఇక వెండి తెరకు దూరం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆమె వివాహం త్వరలోనే జరగబోతోందట. హైదరాబాద్ లో ఆగష్టు 30 న స్వాతి వివాహం జరగబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

లవ్ మ్యారేజ్
చాలా కాలంగా ప్రేమిస్తున్న తన ప్రియుడిని స్వాతి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. వరుడిపేరు వికాస్. చాలాకాలం స్నేహితులుగా ఉన్న వీరిద్దరూ ప్రేమికులుగా మారారు. వికాస్ అంతర్జాతీయ పైలెట్ గా పనిచేస్తున్నాడు. మలేషియన్ ఎయిర్ లైన్స్ లో వికాస్ పైలెట్.

శుభాకాంక్షల వెల్లువ
స్వాతి పెళ్లి వార్త బయటకు రావడంతో ఆమెకు సోషల్ మీడియా వేదికగా అభిమానులనుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వివాహం హైదరాబాద్ లోనే జరగనున్నా రిసెప్షన్ మాత్రం కేరళలో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

చూడ ముచ్చటగా
ఓ సంధర్భంలో స్వాతి తన ప్రియుడితో కలసి ఉన్న ఫొటోని ప్రస్తుతం నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. జంట చూడముచ్చటగా ఉందంటూ ప్రశంసితున్నారు. స్వాతి నటించిన పలు చిత్రాల్లో విజయవంతం అయ్యాయి.

సింగర్ గా కూడా
స్వాతి నటిగానే కాక సింగర్ గా కూడా రాణించింది. 100 పర్సెంట్ లవ్, కథ స్క్రీన్ ప్లే దర్శత్వం అప్పలరాజు, స్వామి రారా వంటి చిత్రాల్లో పాటలు పాడి మెప్పించింది. స్వాతి నటనకు చాలా మంది అభిమానులు ఉన్నారు. పెళ్ళైన తరువాత నటనకు దూరం అవుతుందా లేదా వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











