ఫేస్ బుక్ సాక్షిగా ఖండించేసింది
హైదరాబాద్ : హీరోయిన్స్ కు పెళ్లి రూమర్స్ కొత్తేం కాదు..అయితే అంతే స్పీడుగా వాటిని వాళ్లు ఖండించటం కూడా కామన్. గత కొంతకాలంగా కలర్స్ స్వాతి అదే పరిస్ధితిని ఎదుర్కొంటోంది. ఆమె పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలు ఒక్కసారిగా మీడియాలో గుప్పు మన్నాయి. అయితే అవన్నీ రూమర్స్ అని, ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని, తనకు తన కెరీర్ ముఖ్యమని ఫేస్ బుక్ సాక్షిగా ఖండన చేసింది స్వాతి.
అలాగే ఇలాంటి రూమర్స్ వింటూంటే నవ్వు వస్తుందని, తాను ఇప్పటివరకూ ఏ పెళ్లి కొడుకుని చూడలేదని, ఇప్పట్లో పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పేసింది. ఓ తమిళ టీవీ ఛానెల్ వారితో మాట్లాడుతూ...నాకు పెళ్ళా...ముహూర్తం ఎప్పుడు, పెళ్లి కొడుకు ఎవరూ అని వెటకారం కూడా చేసేసింది. నా పెళ్లి గురించి నా కన్నా మీకే ఎక్కువ తొందరగా ఉందే అని మీడియాకు చురకలు అంటించింది.

అలాగే నా వరకు నా కెరీర్‌పై సంతృప్తిగా ఉన్నాను. యువతరం హీరోలు, యువ దర్శకులతో పనిచేస్తూ వెళుతున్నా. తొలిరోజుల్లో మాత్రం స్టార్ హీరోలతో కలిసి నటించలేకపోతున్నానే అని కొంచెం ఆందోళనకి గురయ్యేదాన్ని. పక్కనున్నవాళ్లు కూడా 'స్వాతీ ఫేస్ బుక్ ఓపెన్ చెయ్యి, పార్టీలకు వెళ్లు, అలా చెయ్, ఇలా మాట్లాడు' అని చెప్పేవాళ్లు. కానీ కొన్నాళ్ల తర్వాత అవేవీ అవసరం లేదని నాకు అర్థమైంది. చిత్ర పరిశ్రమలో విజయాలే కీలకం. మంచి కథల్ని ఎంచుకొన్నప్పుడే విజయాలు దక్కుతుంటాయి అన్నారు.
ఇక నిఖిల్, స్వాతి ల కార్తికేయ సినిమా షూటింగ్ చివరిదశలో వుంది. ప్యాచ్ వర్కులతొ సహా ఈ సినిమా షూటింగ్ ను త్వరలో ముగించానున్నారు. చందూ మొందేటి దర్శకుడిగా పరిచయంకానున్నాడు. మాగ్నమ్ సినిమా ప్రైమ్ బ్యానర్ పై వెంకట్ శ్రీనివాస్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
దేవాలయం నేపధ్యంలో వరుస మరణాల మిస్టరీ ని చేదించడానికి నిఖిల్ ఒక గ్రామానికి వెళ్తాడు. ఈ సినిమా ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం తమిళ, తెలుగు భాషలలో విడుదలకానుంది. నిఖిల్ సిద్ధార్ధ, స్వాతీ తమ గత చిత్రం 'స్వామి రారా' విజయంతో చాలా ఆనందంగా వున్నారు. మరోసారి ఆ మ్యాజిక్ ను తెరపై ప్రదర్శించాలని కోరుకుంటున్నారు.
ఈ చిత్రం గురించి స్వాతి మాట్లాడుతూ.... ఇది ఎంటర్ టైన్మెంట్ బేస్ గా ఉంటుంది, ముఖ్యంగా సామర్లకోట దగ్గరలోని బెమ్మేశ్వరాలయం చుట్టూ జరిగే కథ ఇది. అన్ని కమర్షియల్ అంశాలు ఉన్న ఈ చిత్రం నాకు స్వామి రా రా తరువాత మంచి హిట్ ఇస్తుందన్న నమ్మకం ఉంది అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ...పూర్తి వినోదాత్మకంగా సినిమా సాగుతుంది. వైజాగ్, అరకు, సామర్ల కోటలోని భీమేశ్వరాలయంలో షూటింగ్ చేసాం. గుడి నేపథ్యంలో సాగే కథ ఇది. అయితే హిస్టారికల్, పీరియాడికల్ మాత్రం కాదు అని తెలిపారు.
ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో తనికెళ్ల భరణి, రావు రమేష్, శ్రీనివాస్ రెడ్డి, తులసి, కిషోర్, జోగి నాయుడు, తాగుబోతు రమేష్, పృథ్వి, గౌతం రాజు, శివన్నారాయణ, స్వామి రారా సత్య, గిరి తదితరులు నటిస్తున్నారు. కెమెరా : కార్తిక్, సంగీతం : శేఖర్ చంద్ర, ఎడిటింగ్ : కార్తిక శ్రీనివాస్, ఆర్ట్ : సాహి సురేష్, పాటలు : కృష్ణ చైతన్య, కొరియోగ్రఫీ : రఘు, ఫైట్స్ : వెంకట్ నాగు, సమర్పణ : శిరువూరి రాజేష్ వర్మ, నిర్మాత : వెంకట శ్రీనివాస్ బొగ్గరం, కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : చందు మొండేటి.


Click it and Unblock the Notifications











