అక్కడ దాచుకున్నానంటూ అసలు గుట్టు విప్పింది.. విడాకులపై కలర్స్ స్వాతి క్లారిటీ!!
మహేష్..మహేష్.. అంటూ అష్టాచమ్మా సినిమాలో సందడి చేసిస చిన్నది అందరికీ గుర్తుండే ఉంటుంది. కలర్స్ స్వాతి చేసిన అల్లరి, ఆమె అందానికి కుర్రకారు ఫిదా అయ్యారు. ఆపై కొన్ని సినిమాలు చేసిన స్వాతి అంతగా ఆకట్టుకోలేకపోయింది. స్వామిరారా, కార్తికేయ వంటి చిత్రాలతో మళ్లీ కమ్ బ్యాక్ ఇచ్చింది. అయితే కెరీర్ మంచి ఊపులో ఉండగానే వివాహం చేసుకుని సెటిలైంది. గత రెండు మూడు రోజులుగా కలర్స్ స్వాతి వివాహ బంధంపై ఎన్నో రూమర్స్ వస్తున్నాయి. వాటిపై స్వాతి పరోక్షంగా స్పందించింది. ఆ కథేంటో ఓసారి చూద్దాం.

పైలెట్‌తో వివాహం..
కమ్ బ్యాక్‌లో సూపర్ హిట్ చిత్రాలను అందుకున్న కలర్స్ స్వాతి సినీ కెరీర్‌ను కొనసాగించలేదు. కొన్ని సినిమాలు చేసుకొని హ్యాపీగా పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. కొంతకాలం క్రితం పైలెట్ వికాస్ వాసును వివాహం చేసుకున్న 'కలర్స్' స్వాతి ఓ ఇంటిది అయిపోయింది.

భర్త, ఇంటిని చూపించిన స్వాతి..
కలర్స్ స్వాతి భర్త, ఇంటికి సంబంధించిన విశేషాలను ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. విదేశాల్లో ఉన్న ఆ ఇంటిని చూపించడమే కాదు.. లైవ్‌లో స్విమ్ కూడా చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అప్పట్లో దీనికి సంబంధించిన వీడియోలు తెగ హల్చల్ చేశాయి.

భర్త ఫోటోలు డిలీట్..
అయితే కలర్స్ స్వాతి తన భర్తతో విడిపోయిందనే వార్తలు దావానంలా వ్యాప్తి చెందాయి. తన భర్త వికాస్ ఫోటోలను సోషల్ మీడియా ఖాతా నుంచి డిలీట్ చేసిందని, ఇద్దరికీ చెడిందని, విడాకులు తీసుకోబోతోన్నారని ఇలా ఏవేవో కథనాలు వైరల్ కాసాగాయి. వీటిపై కలర్స్ స్వాతి పరోక్షంగా స్పందించింది.
Recommended Video
అందులో దాచుకున్నాను..
అయితే భర్త ఫోటోలను డిలీట్ చేయలేదని, భద్రంగా దాచుకున్నానని చెప్పుకొచ్చింది. ఎవ్వరూ చూడని చోటు, నా ఖాతా ప్రారంభమైనప్పటి నుంచి ప్రత్యేకమైన ఫోటోలన్నీ అందులోనే దాచుకుంటున్నానని చెప్పుకొచ్చింది. దీంతో విడాకుల వార్త వట్టి రూమరేనని స్పష్టమైంది.


Click it and Unblock the Notifications











