twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇంగ్లీష్ టీచర్ గా మారిన 'కలర్స్' స్వాతి

    By Srikanya
    |

    'అష్టాచమ్మా' చిత్రంతో అదరకొట్టిన కలర్స్ స్వాతి మరోసారి ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. 'గోల్కొండ హైస్కూల్‌' టైటిల్ తో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో స్వాతి..ఓ ఇంగ్లీష్ టీచర్ పాత్రను చేస్తోంది. సినిమా మొత్తం చీరలో కనపడుతుంది. అలాగే సుమంత్ ఈ చిత్రంలో క్రికెట్ కోచ్ గా కనిపిస్తాడు. పద్నాలుగు మంది కుర్రాళ్ళను క్రికెట్ నేర్పి విజయం సాధించేలా చేస్తాడు. ఈ చిత్రం టైటిల్ కి ఆటలు మా హక్కు అని ట్యాగ్ లైన్ పెట్టారు. పి.రామ్మోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది.

    హీరో సుమంత్‌ ఈ చిత్రం గురించి మాట్లాడుతూ నా జీవితంలో మళ్లీ ఇలాంటి పాత్ర రాదు. ఈ సినిమా కోసం కొంత మంది హీరోల్ని సంప్రదించారు. వాళ్లు అంగీకరించలేదు. ఈ సినిమా చూశాకా నటించలేనందుకు వారు బాధపడతారు. బాలీవుడ్ ‌లో 'లగాన్', 'చక్‌దే' సినిమాల తర్వాత అక్కడి ట్రెండ్ ఎలా మారిందో ఈ సినిమా తర్వాత తెలుగు చిత్రపరిశ్రమలో కూడా మార్పు వస్తుందని ధీమాగా చెప్తున్నారు.

    స్కూల్లో జరిగే క్రికెట్‌ టోర్నమెంటు నేపథ్యంగా జరిగే కథ ఇది. హరిమోహన్‌ పరువు రచించిన 'ది మెన్‌ విత్‌ఇన్‌' నవల స్ఫూర్తితో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, సుబ్బరాజు, షఫీ, రవిప్రకాశ్‌, ఝాన్సీ, హేమలతోపాటు కొంతమంది పాఠశాల విద్యార్థులూ నటించారు. కెమెరా: సెంథిల్‌ కుమార్‌, సంగీతం: కల్యాణి మాలిక్‌, పాటలు: సీతారామశాస్త్రి, కళ: రవీందర్‌, కూర్పు: శ్రావణ్‌.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X