కలర్స్ స్వాతి ఇప్పుడు మహేష్ బాబు ని తన శరీరంపై టట్టుగా వేయించుకుంది.అయితే అది రియల్ లైఫ్ లో కాదుట. ఇంద్రగంటి మోహన్ కృష్ణ రచన,దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంచిక్ కామిడీ అష్టా చెమ్మా లో నట. ఈ చిత్రంలో స్వాతి మహేష్ అంటే పిచ్చ అభిమానం గల లావణ్యగా కనపడుతుంది. ఆమెకు నాని అనే (కొత్త కుర్రాడు) లైన్ వేస్తూంటాడు. అయితే ఓ రోజు స్వాతికి హృదయం బ్రద్దలయ్యే వార్త తెలుస్తుంది.అది మహేష్ కి పెళ్ళయిందని. ఆ దారుణమైన వ్యధ నుండి ఆమె ఎలా బయిటపడిందనేది నవ్విస్తూ చెప్తున్నాం అంటున్నారు మోహన్ కృష్ణ. మనం ప్రేమించే హీరోయిన్స్ కి,హీరోలకి పెళ్ళయితే ఏం చేయాలనేది తెలుసుకోవటం మంచిదేగా ...కానిద్దాం. ఇక ఈ లైట్ హార్టడ్ రొమాంటిక్ కామిడీని సురేష్ ప్రొడక్షన్స్ వారు సమర్పిస్తున్నారు.