కలర్ 'మాయాబజార్' ఎలాగుంది?
సినిమా స్వర్ణయుగం కాలం నాటి 'మాయాబజార్' చిత్రానికి రంగులద్ది రీసెంట్ గా ధియోటర్స్ లో సూపర్ గుడ్ వారు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆ జనరేషన్ వారినే కాక ఈ కాలం వారిని కూడా విపరీతంగా ఆకట్టుకుంటోంది. ధియోటర్స్ వద్ద శని, ఆదివారాల రెండు రోజులు ఫ్యామిలలో హౌస్ ఫుల్ వాతావరణం కనపడింది.మంచి సినిమాకు ఆదరణకు కాలపరిమితి లేదన్నది మరో సారు రుజువైనట్లయింది. ఇక చిత్రంలో యంగ్ సావిత్రిని కలర్స్ చూడటం ఓ ప్రత్యేక అనుభూతి అని పెద్దలంటున్నారు. అలాగే నాగేశ్వరరావు, ఎన్టీఆర్, ఎస్వీఆర్ ఇలా ఎవరికి వారే పోటీపడినట్లుగా నటించి అధ్బుతంగా పండించిన సీన్లను మరోసారి చూసే అవకాశం ఈ కలర్ మార్పిడి ఇచ్చిందని సినీ లవర్స్ మురిసిపోతున్నారు. అయితే రెండు పాటలు తీసేయటం మాత్రం కాస్త బాధ కలిగించిందంటున్నారు. అలాగే తమ మాయతో మాయాబజార్ ని అద్బుతంగా కలర్స్ లోకి మార్చిన గోల్డ్ స్టోన్ వారిని మాత్రం అబినందించాల్సిన సమయమిది.


Click it and Unblock the Notifications











