హీరోయిన్ గా కాకపోయినా చేస్తాను అంటోంది పాపం
ఇకపై తాను హీరోయిన్‌గా మాత్రమే చేయాలని అనుకోవడంలేదనీ, నటకు ప్రాధాన్యమున్న పాత్ర చిన్నదైనా ఒప్పుకుంటానంటోంది కలర్స్ స్వాతి. ఆమె రెమ్యునేషన్ విషయంలో నిర్మాతలను ఇబ్బందికి గురి చేస్తున్నట్లు ఇటీవల పరిశ్రమలో బాగా ప్రచారం జరిగింది. ఇవన్నీ రూమర్స్ అనీ, తాను ఎప్పుడూ ఏ నిర్మాత వద్ద పారితోషికం విషయంలో డిమాండ్ చేయలేదనీ చెప్పుకొచ్చింది. కథ, నా పాత్రకే ప్రాధాన్యమిస్తాను తప్ప డబ్బుకు కాదంటోంది. తెలుగులో రెండు మూడు సినిమాలు సెట్స్‌పై వున్నాయనీ, తమిళంలో ఓ సినిమా చేస్తున్నట్లు స్వాతి చెబుతోంది.అలాగే తనకు టాలీవుడ్‌లో రాత్రికి రాత్రే స్టార్ అయిపోవాలన్న అత్యాశతో లేదని నటిగా నాకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ని సొంతం చేసుకోవాలన్నదే నా డ్రీమ్ అంటోంది.ఇక ఆ డ్రీమ్ 'సుబ్రమణియపురం" సినిమాతో తీరిందిని చెప్తోంది.ఏదైమైనా రామ్‌గోపాల్‌వర్మ చిత్రం 'కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:అప్పల్రాజు"తో ఫ్లాప్ వచ్చిన తర్వాతే స్వాతి ఇలా మాట్లాడుతోందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











