'హ్యాంగోవర్...' లో ఊగిపోయిన కలర్స్ స్వాతి
హైదరాబాద్: 'ఏ స్క్వేర్.. బీ స్క్వేర్...' అంటూ '100% లవ్'లో కలర్స్ స్వాతి పాడిన పాట గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు మరోసారి కలర్స్ స్వాతి గొంతు సవరించుకొంది... 'స్వామి రా రా' చిత్రం కోసం. 'హ్యాంగోవర్...' అంటూ సాగే ఈ పాటలో హీరో నిఖిల్ కూడా గొంతు కలిపాడు. ఈ పాట తమ చిత్రం హైలెట్స్ ల ఒకటి అని చిత్రం బృందం అంటోంది.
కలర్స్ స్వాతి, నిఖిల్ కలిసి నటిస్తున్న చిత్రమే 'స్వామి రా రా'. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. చక్రి చిగురుపాటి నిర్మాత. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెల 23న పాటలు విడుదల చేస్తారు. దర్శకుడు మాట్లాడుతూ ''వినాయకుడి విగ్రహం చుట్టూ చిత్రం నడుస్తుంది. చిన్న చిన్న దొంగతనాలతో హస్తలాఘవం ప్రదర్శించే ఓ కుర్రాడిని మరో చోరీకి పురిగొల్పిన ముద్దుగుమ్మ కథేమిటన్నది తెరపైనే చూడాలి''అన్నారు. వచ్చే నెల 14న చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు.
లవ్ విత్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన స్వామి రారా పక్కా కమర్షియల్ చిత్రమని నిర్మాత చక్రి చిగురుపాటి అన్నారు. క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రేక్షకులు థ్రిల్‌గా ఫీలయ్యే అంశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు.
ఓ వినాయకుడి చుట్టూ తిరిగే కథ స్వామి రారా చిత్రమని, ఈ నెలలో పాటలను విడుదల చేసి ఫిబ్రవరి 14వ తేదీన చిత్రాన్ని విడుదల చేస్తామని చక్రి చిగురుపాటి చెప్పారు. నిఖిల్‌తో వీడు తేడా చిత్రాన్ని నిర్మించిన తాము అతనితో మరో చిత్రం చేయడం ఆనందంగా ఉందని సహ నిర్మాత సందీప్ కొరటాల అన్నారు. అన్ని వర్గాల ప్రజనలను ఈ చిత్రం ఆకట్టుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
రవిబాబు, ప్రవీణ్, జీవా తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. సన్ని సంగీతాన్ని సమకూర్చారు. కెమెరా రిచర్జ్ ప్రసాద్. కృష్ణచైతన్య పాటలు రాశారు. ఆర్ట్ నాగేంద్ర. ఎడిటింగ్ ఎస్ఆర్ శేఖర్. సమర్పణ శంకర్ చిగురుపాటి, రచన, దర్శకత్వం సుధీర్ వర్మ.


Click it and Unblock the Notifications











