కలర్స్ స్వాతి ‘బంగారు కోడిపెట్ట’ కథేంటి?
ఇక ఈ చిత్రం కథ నేరేషన్ ఎలా నడుస్తుందంటే... ''భాను అనే ఓ మధ్య తరగతి అమ్మాయి తన కాళ్ల మీద నిలబడే ప్రయత్నంలో టక్కరివాడైన వంశీని ఎంచుకోవడం మొదటి కథ. పిజ్జా డెలివరీ బోయ్‌గా పని చేస్తూ, తెలుగు సినిమా హీరో అవ్వాలని ఓ కుర్రాడు చేసే ప్రయత్నమే రెండో కథ. కవలల నేపథ్యంలో మూడో కథ సాగుతుంది. ఈ మూడు కథలు ఒకచోట కలవడంతో సినిమా ప్రారంభమవుతుంది. సంక్రాంతి నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. వినోదాత్మకంగా సాగే రొమాంటిక్ క్రైమ్ కథాచిత్రమిది. మూడు విభిన్న కథలతో ఈ చిత్రం ఆసక్తికరంగా సాగుతుంది. మొదటి కథలో వంశీగా నవదీప్, భానూగా స్వాతి నటించారు.
దర్శకుడు మాట్లాడుతూ ''సంక్రాంతి నేపథ్యంలో సాగే చిత్రమిది. మనిషి తన జీవితంలో రకరకాల అడ్డదారులను వెదుకుతుంటాడు. జీవితం మాత్రం తనదైన దారినే చూపెడుతుందన్న అంశాన్ని ఇందులో ఆసక్తికరంగా చెప్పాం. దొంగతనం, పేకాట, కోడి పుంజు అపహరణ, సినిమా ఆడిషన్స్ తదితర అంశాల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు చక్కటి వినోదాన్ని పంచుతాయి''అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ... ''ఇందులో మూడు కథలున్నాయి. ఒకదానికొకటి ఏ మాత్రం సంబంధం లేని ఆ మూడు కథల్ని ఓ చోట కలిపిన విధానం ప్రేక్ష కుల్ని ఆకట్టుకొంటుంది. వచ్చే నెలలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ''న్నారు నిర్మాత. ఈ చిత్రానికి మాటలు: ప్రసాద్ వర్మ పెన్మత్స, సంగీతం: మహేష్ శంకర్, పాటలు: అనంతశ్రీరామ్.


Click it and Unblock the Notifications












