పాపం..కలర్స్ స్వాతికి ఉభయ బ్రష్టత్వం

By Srikanya

ఒక్కసారిగా ఉవ్వెత్తిన ఎగిసిన కలర్స్ స్వాతి కెరీర్ ఇప్పుడు కష్టాలు ఎదుర్కొంటోంది. ఆమె హీరోయిన్ గా చేసిన సుబ్రమణ్యపురం(తెలుగు డబ్బింగ్ అనంతపురం)తమిళ, తెలుగులలో రిలీజై ఆమెకు ఫెరఫార్మెన్స్ కు మంచి మార్కులు వేయించి అవకాశాలు రప్పించింది. అయితే ఆమె నేను సెలక్టెడ్ గా ఉంటాను అంటూ తెలుగులో ఏ పాత్రనూ ఒప్పుకోక కేవలం కలవరమాయే మదిలో చిత్రం ఒకటే చేసింది. అది భాక్సాపీస్ వద్ద పేలిపోయింది. ఈలోగా తమిళంలో సెల్వరాఘవన్ దర్శకత్వంలో విక్రమ్ సరసన ఓ చిత్రం చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ సినిమాను ఆగిపోయినట్లేనని తెలుస్తోంది. ఎందుకంటే లేటెస్ట్ గా భారీ బడ్జెట్ తో సెల్వరాఘవన్ డైరక్ట్ చేసిన అయిరాతిల్ ఒరువిన్ చిత్రం భారీ ఫ్లాప్ గా మిగిలిపోయింది. దాంతో విక్రమ్ తాను 13బి చిత్రం డైరక్ట్ చేసిన దర్శకుడు చిత్రం చేస్తూ బిజీగా ఉన్నానని డేట్స్ ఆపారని అన్నారు. సెల్వరాఘవన్ ఆ చిత్రాన్ని తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చానని అన్నా అది పూర్తయ్యే అవకాశం లేదని అంటున్నారు. దాంతో అష్టాచెమ్మా హీరోయిన్ గా ఇక్కడ బ్రేక్ తెచ్చుకుని అవకాశాలు దక్కించుకోలేక, తమిళంలోనూ ముందుకు వెళ్ళక స్వాతి ఉభయ బ్రష్టత్వం చెందిందని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X