స్వాతి..మహేష్ ని చేరింది!?

ఆ చిత్రంలో మహేష్ ఫ్రెండ్ గా పూర్తి స్థాయి పాత్ర పోషిస్తున్న కమెడియన్ సునీల్ కు జోడిగా ఆమె నటించబోతోందని అంటున్నారు. అంటే సునీల్, కలర్స్ స్వాతి కలిసి అష్టాచెమ్మా రేంజిలో కామెడీని దున్నేస్తారన్నమాట. ఇక అష్టాచెమ్మ లో మహేష్ కి వీరాభిమానిగా కనిపించటమే ఈ ఎంపికలో ప్రధానపాత్ర వహించిందని తెలుస్తోంది. ఇక కలర్స్ స్వాతి కూడా ఏం ఖాళీగా లేదు.
హీరోయిన్ పాత్రలో బిజీగా ఉంది. 'హోప్' చిత్రానికి జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన సతీష్ దర్శకత్వంలో రూపొందుతున్న 'కలవరమాయె మదిలో' చిత్రంలోనూ, ఇంకా పేరు పెట్టని మరో చిత్రంలోనూ స్వాతి కథానాయికగా నటిస్తోంది. తమిళంలో ఆమె నటించిన 'సుబ్రమణియపురం'హిట్టవటంతో అక్కడా అవకాశాలు వరసగా వరిస్తున్నాయి. ఇక స్వాతి టార్గెట్ అయిన మహేష్ ని ఈ చిత్రంలో సైడ్ క్యారెక్టర్ చేయటం ద్వారా కొంతవరకు రీచ్ అయినట్లేకదా.


Click it and Unblock the Notifications











