అప్పుడు అంజలి...ఇప్పుడు కలర్స్ స్వాతి

By Srikanya

హైదరాబాద్: నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది స్వాతి. తెలుగులో అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్, స్వామిరారా, కార్తికేయ చిత్రాలతో వరుస విజయాలు దక్కించుకుంది. మరోవైపు తమిళ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేస్తూ, అక్కడ కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంది స్వాతి. ప్రస్తుతం ‘త్రిపుర' అనే చిత్రంలో కథానాయికగా నటించడానికి అంగీకరించింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

కలర్స్ స్వాతి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'త్రిపుర'. నవీన్‌చంద్ర ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. రాజ్‌కిరణ్‌ దర్శకుడు. ఎ.చినబాబు, ఎం.రాజశేఖర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గతంలో ఇదే దర్శకుడు తీసిన గీతాంజలి చిత్రంలో అంజలి హీరోయిన్ గా చేసింది. అదే తరహాలో ఉత్కంఠ ప్రధానంగా ఈ చిత్రం నడవనుంది. ఈ చిత్రానికి కోన వెంకట్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.

Colours Swathi is lead in “Tripura”

దర్శకుడు మాట్లాడుతూ ''ఇదివరకు నేను తీసిన 'గీతాంజలి'ని మించిన ఉత్కంఠతతో ఈ చిత్రం సాగుతుంది. ఇందులో త్రిపురగా స్వాతి నటిస్తుంది''అన్నారు.

కోన వెంకట్‌ మాట్లాడుతూ ''దర్శకుడు ఈ కథని బాగా తీర్చిదిద్దాడు. నేను స్క్రీన్‌ప్లే సమకూరుస్తున్నా'' అన్నారు. ''తమిళం, తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ 15 నుంచి ప్రారంభిస్తాం'' అన్నారు నిర్మాతలు.

హర్రర్ కామెడీగా వచ్చి మంచి హిట్టయిన గీతాంజలి సినిమాకు సీక్వెల్‌గా తీస్తోన్న త్రిపుర చిత్రం షూటింగ్ ఇవాళ హైదరాబాద్‌లో షురూ అయింది. ఈ సినిమాలో కలర్ స్వాతి హీరోయిన్‌గా నటిస్తున్నారు. అష్టాచమ్మా, స్వామిరారా, కార్తికేయ చిత్రాల్లో తనకుంటూ ఓ క్రేజ్‌ని సంపాదించుకున్న స్వాతి లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయడం ఇదే తొలిసారి. చిత్రానికి రాజ కిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎ.చినబాబు, ఎం.రాజశేఖర్ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఏప్రిల్ 6న ఈ చిత్ర పూజా కార్యక్రమాలు జరుపనున్నారని, అదే నెల 13 నుంచి 25 వరకు తొలి షెడ్యూల్ జరగనుంది. ఓ శక్తిమంతమైన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో స్వాతి టైటిల్ రోల్ పోషిస్తుందట.

ఈ సినిమాతో నటిగా స్వాతి తనలోని మరో మంచి కోణాన్ని ఆవిష్కరించే చిత్రం అవుతుందని అంటున్నాయ చిత్ర యూనిట్‌వర్గాలు. చిత్రానికి సినిమాటోగ్రఫీ రవికుమార్, సంగీతం కామ్రాన్, ఎడిటింగ్ ఉపేంద్ర, ఫైట్స్ విజయ్, కోరియోగ్రఫీ బాబా భాస్కర్, కో డైరెక్టర్‌గా ఎమ్.వి.ఎన్.మురళి వ్యవహరిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X