'కలర్స్' స్వాతి కమిటయిన కొత్త చిత్రం...
ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం..అప్పలరాజు చిత్రంలో నటిస్తున్న కలర్స్ స్వాతి మరో చిత్రం కమిటయిందని సమాచారం. రామ్ హీరోగా ఒప్పుకున్న కందిరీగ చిత్రంలో ఆమె నటించనుంది. ఈ మేరకు నిర్మాత బెల్లంకొండ సురేష్ తో ఎగ్రిమెంట్ అయినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఇక ఇప్పటికే ఈ చిత్రంలో మస్కాలో రామ్ సరసన చేసిన హన్సిక మెయిన్ హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రం ద్వారా సంతోష్ శ్రీనివాసన్ అనే కొత్త దర్శకుడు పరిచయమవుతున్నారు. త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం బెల్లకొండ సురేష్..వెంకటేష్ హీరోగా నిర్మించిన నాగవల్లి..ది రిటన్ ఆప్ చంధ్రముఖి చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమవుతోంది.
హన్సిక రామ్ కందిరీగ బెల్లంకొండ సురేష్ సునీల్ కలర్స్ స్వాతి రామ్ గోపాల్ వర్మ appalaraju colours swathi sunil hansika kandireega bellamkonda suresh


Click it and Unblock the Notifications