కలర్స్ స్వాతితో మళ్ళీ రామ్ గోపాల్ వర్మ
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో కలర్స్ స్వాతి ..కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం అప్పలరాజు చిత్రంలో చేసిన సంగతి తెలిసిందే.సునీల్ హీరోగా వచ్చిన ఆ చిత్రం డిజాస్టర్ కావటంతో ఆ తర్వాత కలర్స్ స్వాతిని పట్టించుకనే నాధుడు కరవయ్యారు.తమిళ మీడియాకు తెలుగులో బిజీగా ఉన్నానని, తెలుగు మీడియాకు అక్కడ వరస ఆపర్స్ వస్తున్నాయని కాలం గెంటుకు వస్తున్న ఈమెను మళ్ళీ రామ్ గోపాల్ వర్మే ఆదుకున్నాడు. ఆయన తన తాజా చిత్రం డిపార్టమెంట్ లో ఆమెకు చోటిచ్చాడు.రానా ప్రక్కన ఆమె ఈ చిత్రంలో చేయనుందని తెలుస్తోంది.ఇక ఇప్పుటికే తెలుగు వారైన లక్ష్మీ ప్రసన్న,రానా ఆ చిత్రంలో చేస్తున్నారు.దీంతో కలర్స్ పాప చాలా హ్యాపీగా ఉంది.
ఇక రామ్ గోపాల్ వర్మ తాజాగా డిపార్టమెంట్ గురించి బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ... డిపార్టమెంట్ చిత్రంలో అమితాబ్ బచ్చన్..పొలిటీషయన్ గా మారిన గ్యాంగస్టర్ పాత్రను పోషిస్తున్నారు. అలాగే నా కెరీర్ లో ఈ చిత్రం బాగా ఎక్కవ బడ్టెట్ అవుతోంది. స్క్రిప్టు కూడా చాలా ప్రెష్ గా ఉంటుంది. ఇక ఈ ప్రాజెక్టు గురించి బయట రకరకాల రూమర్స్ వినపడుతున్నాయి.
అమితాబ్..పోలీస్ ఆఫీసర్ గా నటించటం లేదు. అలాగే ఈ చిత్రం కంపెనీ కి సీక్వెల్ కాదు..అలాగే అబతక్ చప్పన్ కి ప్రీక్వెల్ కూడా కాదు. ఇక నాకు ఎప్పుడూ అమితాబ్ ని మాస్ హీరోగానే చూస్తాను. ఆయన్ని లార్జర్ దేన్ లైఫ్ హీరోగా డిపార్టమెంట్ లో చూపదలుచుకున్నాను. రానా ఈ చిత్రంలో చేస్తున్నాడు .రానా, సంజయ్ దత్ ఇద్దరూ పోలీస్ లు కనిపిస్తారు. రానా కు మెంటర్ గా సంజయ్ దత్ కనిపిస్తారు అన్నారు.


Click it and Unblock the Notifications











