కలర్స్ స్వాతి ‘స్వామి రారా’కాన్సెప్టు
హైదరాబాద్ : కలర్స్ స్వాతి,నిఖిల్ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం 'స్వామి రారా'. ఈ చిత్రం కాన్సెప్టు గురించి దర్శకుడు సుధీర్ వర్మ మాట్లాడుతూ...''ఒక వినాయకుడి విగ్రహం చుట్టూ తిరిగే కథ ఇది. సినిమాలోని పాత్రలన్నీ వినాయకుడి విగ్రహం చుట్టూ సాగుతుంటాయి. ఓ ప్రేమ జంటకు, స్వామి విగ్రహానికి ఉన్న సంబంధం ఏమిటనేది ఆసక్తికరం. ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. కేరళ, తమిళనాడుల్లో పాటలు చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నాము. లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్న సినిమా. వచ్చే నెలాఖరుకి ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తవుతుంది'' అన్నారు.
లవ్ విత్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈచిత్రాన్ని పక్కా కమర్షియల్ అంశాలతో రూపొందిస్తున్నారు. తాజాగా ప్రారంభమైన షెడ్యూల్ కేరళ, కర్ణాటక, తమిళనాడులలో పాటల చిత్రీకరణ ఉంటుందని నిర్మాత చక్రి తిలిపారు. సహనిర్మాత సందీప్ కొరిటాల మాట్లాడుతూ 'నిఖిల్‌తో 'వీడుతేడా' చిత్రాన్ని నిర్మించిన మేము అతనితో మరో చిత్రం చేయడం ఆనందంగా వుంది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే చిత్రమిది' అన్నారు.
చాలా కాలంగా సరై హిట్ లేని నిఖిల్, స్వాతిలు ఈచిత్రంపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. పూజ, రవిబాబు, ప్రవీణ్, జీవా తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: సన్ని, కెమెరా: రిచర్డ్ ప్రసాద్, పాటలు: కృష్ణచైతన్య, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, నిర్మాత: చక్రి చిగురుపాటి, రచన, దర్శకత్వం: సుధీర్‌వర్మ.


Click it and Unblock the Notifications












