For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇంకో హర్రర్ కామెడీ ( ‘త్రిపుర’ ప్రివ్యూ)

  By Srikanya
  |

  హైదరాబాద్ : ప్రస్తుతం తెలుగు, తమిళ పరిశ్రమలలో హర్రర్, హర్రర్ కామెడీల సీజన్ నడుస్తోంది. ఈ సీజన్ ని కొనసాగిస్తూ తాజాగా మరో చిత్రం ఈ రోజు ధియోటర్లలో దిగుతోంది. ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ కూడా అయిపోవడంతో ఎలాంటి ఇబ్బంది రాలేదు. అలాగే ఈమధ్య చిన్న సినిమాలకు థియేటర్స్ దొరకడం కష్టంగా ఉన్న ఈరోజుల్లో త్రిపుర లాంటి చిన్న బడ్జెట్ సినిమాకి సుమారు 600 థియేటర్స్ దొరికాయి. త్రిపుర సినిమా ఒక్క నైజాంలో 250/ 300 థియేటర్స్‌లో రిలీజ్ అవుతోంది.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  తింగరితనం, కాస్త గడుసుతనం కలిగిన పల్లెటూరి అమ్మాయి త్రిపుర పాత్రలో స్వాతి కనిపిస్తుంది. స్వాతికి చిన్నప్పటినుంచి కొన్ని కలలు వస్తుంటాయి. అవి రియల్ లైఫ్‌లో నిజం అవుతుంటాయి. అవి యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా లేక తన భవిష్యత్తుకు తెలుస్తుందా అనే అంశాలతో చాలా సస్పెన్స్‌తో కూడిన థ్రిల్లర్ సినిమా ఇది. పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుని భర్తతో కలిసి పట్నంలో కాపురం వుంటున్న ఆ అమ్మాయికి వచ్చిన ఒక కల తన జీవితాన్ని ఎలా మార్చింది అనేదే అసలు కథ. నిజానికి ఇది దెయ్యం సినిమా కాదు. అలాంటి కలల వలన ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేసింది అనేదే కథ. ఒక థ్రిల్లర్ మూవీ. సస్పెన్స్ అంశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.

  Colours Swathi's Tripura movie preview

  చిత్రం హైలెట్స్ ...

  త్రిపుర సినిమాకి చాలా క్రేజ్ ఉంది. దానికి మూడు కారణాలు ‘గీతాంజలి' లాంటి సూపర్ హిట్ ఇచ్చిన రాజ్‌కిరణ్ ఈ సినిమాకి డైరెక్టర్ అవ్వడం, రెండవది ‘స్వామిరారా', ‘కార్తికేయ'లాంటి వరుస విజయాల తరువాత స్వాతి నుంచి వస్తున్న సినిమా కావడం. ఫైనల్‌గా కోన వెంకట్, వెలిగొండ శ్రీనివాస్ లాంటి టాప్ టెక్నీషియన్స్ పనిచేయడమే కాకుండా ట్రైలర్స్ అన్నీ ఆడియన్స్‌ని ఆకట్టుకోవడం వలనే ఈ సినిమాకి ఇంత క్రేజ్ వచ్చింది.

  ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. దాంతోపాటు హారర్ థ్రిల్లర్ మిక్స్ అయిన కథ. ఈ సినిమాలో ఫ్యామిలీ ఎపిసోడ్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే లవ్, కామెడీ, భయపెట్టే అంశాలతోపాటు థ్రిల్లింగ్ స్టోరీలైన్ కూడా ఉంది. నవ్విస్తూ, భయపెడుతూ అందరినీ థ్రిల్ చేసే సినిమానే త్రిపుర.

  అలాగే ..సిజికి ప్రాముఖ్యత ఎక్కువే ఉంది. సుమారు 16 నిమిషాలపాటు సిజి ఎఫెక్ట్స్ ఉంటాయి. వాటిని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా డిజైన్ చేసారు.

  బ్యానర్ : జీ మీడియా
  నటీనటులు: కలర్స్ స్వాతి, నవీన్ చంద్ర, శ్రీమాన్, పూజ, సప్తగిరి, రావు రమేశ్, షకలక శంకర్, ధన్ రాజ్, జయప్రకాశ్ రెడ్డి తదితరులు
  స్క్రీన్ ప్లే : కోనవెంకట్, శ్రీనివాస్ వెలిగొండ,
  మాటలు: రాజా,
  సినిమాటోగ్రఫీ: రవికుమార్ సానా,
  ఎడిటింగ్: ఉపేంద్ర,
  పాటలు: చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి,
  నిర్మాతలు: ఎ.చినబాబు, ఎమ్.రాజశేఖర్,
  కథ-దర్సకత్వం: రాజకిరణ్,
  సమర్పణ: జె.రామాంజనేయులు.​​​
  నిర్మాతలు : ఎ. చినబాబు, ఎం. రాజశేఖర్
  విడుదల తేదీ : నవంబర్ 6, 2015.

  English summary
  'Colors' Swathi's Tripura releasing today. Its trailer was released short while ago and it attracted many. Raj Kiran who directed Anjali’s Geethanjali is directing this movie. Kona Venkat and Veligonda Srinivas are providing the screenplay.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X