ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా..?: "డేంజర్" అనుభవం చెప్పిన కలర్స్ స్వాతి
దర్శకత్వంలో వచ్చిన కృష్ణవంశీ "డేంజర్" సినిమాతో వెండితెర అరంగేట్రం చేసింది కలర్స్ స్వాతి . ఆ సందర్భంగా కృష్ణవంశీతో జరిగిన సంభాషణను తాజా ఇంటర్వ్యూలో పంచుకుంది.
Recommended Video

ప్రస్తుతానికి అటు టాప్ రేంజ్ కాకుండా, ఇటు ఖాళీగా లేకుండా తన రేంజ్ లో కొంత బిజీగానే ఉంది కలర్స్ స్వాతి. మా టీవీలో వచ్చిన కలర్స్ ప్రోగ్రామ్‌తో బల్లితెర మీద సూపర్ పాపులర్ అయిన స్వాతి ఆ తర్వాత వెండితెర మీదకు రంగ ప్రవేశం చేసింది. కృష్ణవంశీ రూపొందించిన డేంజర్ ఆమెకు తొలి సినిమా.

కృష్ణవంశీతో సంభాషణ
ఆ సినిమా కంటే ముందు "గంగోత్రి"లో అల్లు అర్జున్ సరసన నటించే అవకాశం వచ్చింది. అయితే చదువు మధ్యలో ఉందన్న కారణంతో ఆ సినిమాను స్వాతి తిరస్కరించింది. ఆ తర్వాత కృష్ణవంశీ "డేంజర్" సినిమాతో వెండితెర అరంగేట్రం చేసింది. ఈ సందర్భంగా కృష్ణవంశీతో జరిగిన సంభాషణను తాజా ఇంటర్వ్యూలో పంచుకుంది.

ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా
"డేంజర్ సినిమా అవకాశం వచ్చినపుడు నేను మా అమ్మ కలిసి కృష్ణవంశీ గారి ఆఫీసుకి వెళ్లాం. అక్కడ ఆయన గదిలో కూర్చుని ఉన్నారు. వెళ్లగానే స్క్రిప్టు చెబుతారా అని అడిగాం. ఆయన ఒక తెల్ల కాగితం తీసుకుని దానిపై పెన్నుతో కేవీ అని రాశి మా వైపు తోశారు. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా అని అడిగారు.

మీరేం సినిమాలు తీశారండీ
మా అమ్మ వెంటనే.. "మీరేం సినిమాలు తీశారండీ" అని అడిగింది. మేం ఆయన తీసిన నిన్నే పెళ్లాడతా, మురారి చూసి ఉన్నప్పటికీ ఆయనే కృష్ణవంశీ అని తెలియదు. నన్నే ఇలా అడుగుతారా అంటూ ఆయన కొంచెం కోప్పడ్డారు. ముందు నువ్వు నటించగలవో లేదో నీకు స్క్రీన్ టెస్టు చేస్తా అన్నారు.

నేను స్క్రీన్ టెస్టు పాసైతే
నేను బదులుగా.. నేను స్క్రీన్ టెస్టు పాసైతే స్క్రిప్టు చెబుతారా అని అడిగాను. తర్వాత ఆయన స్క్రీన్ టెస్టు చేసి.. బాగా చేశావంటూ మెచ్చుకుని స్క్రిప్టు చెప్పారు. ఆ సినిమా చేసేటపుడు ఆయన గొప్పదనమేంటో తెలిసింది.

క్లాస్ పీకారు
ఈ సినిమా అయ్యాక నా పేరుతో ఏదో ఎంఎంఎస్ సర్క్యులేట్ అవుతున్నట్లు గాసిప్స్ వచ్చాయి. అప్పుడు కృష్ణవంశీ గారు ఒక వైబ్ సైట్ వాళ్లకు ఫోన్ చేసి.. క్లాస్ పీకారు. వెంటనే ఆ ఆర్టికల్ తీయించారు. ఈ విషయం వంశీ గారి అసిస్టెంట్ల ద్వారా నాకు తెలిసింది. అందుకే ఆయనంటే నాకెంతో గౌరవం" అని స్వాతి వెల్లడించింది.


Click it and Unblock the Notifications











