సినిమా పెద్దగా ఆడలేదు నిజమే...కలర్స్ స్వాతి

By Srikanya

కలర్స్ స్వాతి చాలా నిర్మొహమాటంగా మాట్లాడుతుందని మరోసారి రుజువు చేసుకుంది. ఆమె క్రితం సంవత్సరం చేసిన కలవరమాయే మదిలో చిత్రం ఫెయిల్యూర్ అయింది. ఆ విషయం గురించి మీడియా వారు ప్రస్దావించకముందే ఆమే..'2010లో మీరు చేసింది ఒక్క సినిమానే కదా. అది కూడా అంతంత మాత్రమే అడింది..' అని అడగాలని ఉందా. ఫర్లేదు అడిగేయండి. నేనేం అనుకోను. ఎందుకంటే నిజాల్ని ఎక్కువ కాలం దాచేయలేం. ఆ సినిమా సంగతి పక్కన పెడితే 2010 ఆనందంగానే గడిచిపోయింది. కొన్ని కష్టాలు ఎదురైనా వాటి ఫలితాలు మాత్రం 2011లో అందుకోబోతున్నా అంది.

ఆమె తాజాగా సుమంత్ సరసన 'గోల్కొండ హైస్కూల్‌' చిత్రం చేసింది. ఆ చిత్రం సంక్రాంతికి విడుదల అవుతోంది. క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఆ చిత్రంలో ఆమె ఇంగ్లీష్ టీచర్ గా చేసింది. అలాగే సునీల్ సరసన రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 'కథ, స్క్రీన్‌ప్లే దర్శకత్వం అప్పల్రాజు'లోనూ చేసింది. సినీ పరిశ్రమ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ చిత్రంలో ఆమె అసెస్టింట్ డైరక్టర్ గా విభిన్నమైన పాత్రలో కనిపించనుంది. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల్లో కాకుండా ఆమె ఇలా విభిన్నమైన చిత్రాల్లో కనిపించటం ఆమె అభిమానులను ఆనందపరిచే విషయం. ఈ సంవత్సరం కూడా ఆమె మరిన్ని చిత్రాలు చేయాలని కోరుకుందాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X