పవన్ కళ్యాణ్ బాటలో కుర్ర హీరోయిన్ స్వాతి!

By Bojja Kumar

హైదరాబాద్: టాలీవుడ్ కుర్ర హీరోయిన్ కలర్స్ స్వాతి కూడా పవన్ కళ్యాణ్ బాట పట్టింది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి తన మద్దతు ప్రకటించింది. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో బీజేపీ ప్రధాని అభ్యర్థి మెడీ గాలి వీస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పవన్ కళ్యాణ్, నాగార్జున, మంచు లక్ష్మి, శివాజీ, సమంత లాంటి వారు మోడీకి తన మద్దతు ప్రకటించారు.

ఇప్పుడు ఆ లిస్టులో కలర్స్ స్వాతి కూడా చేరడం చర్చనీయాంశం అయింది. మోడీ గురించి ఆమె మాట్లాడుతూ....మోడీ లాంటి వ్యక్తులు ప్రధాని అయితే దేశానికి మంచి జరుగుతుందని అంటోంది. యువత కూడా అదే కోరుకుంటున్నారని స్వాతి అభిప్రాయ పడుతోంది. అదే సమయంలో రాహుల్ గురించి అడిగినపుడు ఆమె పక్కున నవ్వేసి....ఆయన మెడీ కంటే చాలా వెనక ఉన్నాడని వ్యాఖ్యానించింది.

Colours Swathi wants to see Modi as PM

స్వాతి గురించిన వివరాల్లోకి వెళితే...యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టిన స్వాతి తన టాలెంటుతో సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ఈ క్రమంలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ హీరోయిన్‌గా ఎదిగింది. ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళం, మళయాలం చిత్రాల్లో నటిస్తూ బిజీబిజీగా గడుపుతోంది.

ప్రస్తుతం ఆమె తెలుగులో 'బంగారు కోడిపెట్ట', 'కార్తికేయ' చిత్రాల్లో నటిస్తోంది. బంగారు కోడి పెట్ట చిత్రంలో నవదీప్ హీరోగా నటిస్తుండగా, కార్తికేయ చిత్రంలో నిఖిల్ సిద్దార్త్ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంతో పాటు తమిళంలో 'అమలి తుమలి', 'వడా కర్రీ', మళయాలంలో ఓ చిత్రంలో నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X