అలీ 40 ఇయర్స్ ఇండస్ట్రీ సెలెబ్రేషన్స్.. సీఎం చంద్రబాబు చీఫ్ గెస్ట్‌గా, ఇంకా ఎవరంటే!

కమెడియన్ అలీ టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంత సీనియారో అందరికి తెలిసిందే. చైల్డ్ ఆర్టిస్ట్ గా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన అలీ ఇప్పటికి స్టార్ కమెడియన్ గా దూసుకుపోతున్నాడు. అలీ కామెడీ టైమింగ్, వెండితెరపై చేసే అల్లరి చేష్టలకు అభిమానుల్లో మంచి క్రేజ్ ఉంది. కామెడీలో అలీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అలీ హీరోగా నటించిన చిత్రాలు కూడా సూపర్ హిట్స్ గా నిలిచాయి. త్వరలో ఈ సీనియర్ కమెడియన్ టాలీవుడ్ లో 40 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తిచేసుకోబోతున్నాడు.

తొలి చిత్రం

తొలి చిత్రం

అలీ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ని ప్రారంభించిన చిత్రం ప్రెసిడెంట్ పేరమ్మ. 1979లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత 80వ దశకంలో సీతాకోక చిలుక, చంటబ్బాయ్ లాంటి చిత్రాలతో అలికి గుర్తింపు పెరుగుతూ వచ్చింది. అలీ బాడీ లాంగ్వేజ్, అల్లరి చేష్టలతో నవ్వించగలగడం లాంటి లక్షణాలతో ఆడియన్స్ కి బాగా చేరువయ్యాడు. దీనితో అలీ టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా మారిపోయాడు. కామెడీ చేస్తూనే హీరో ఫ్రెండ్ పాత్రల్లో మెప్పించగలగడం అలీ ప్రత్యేకత.

 40 ఇయర్స్ సెలెబ్రేషన్స్

40 ఇయర్స్ సెలెబ్రేషన్స్

ఈ ఏడాదితో అలీ ఇండస్ట్రీలోకి ప్రవేశించి 40 ఏళ్ళు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఫిబ్రవరి 23న ఘనంగా వేడుక నిర్వహించనున్నారు. ఈ వేడుకలో అలికి సన్మానం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. సంగమం ఫౌండేషన్ సంస్థ అలీ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. 23న సాయంత్రం 6 గంటలకు ఈ ఈవెంట్ పార్రంభం అవుతుంది.

 చిత్ర పరిశ్రమ నుంచి

చిత్ర పరిశ్రమ నుంచి

సీఎం చంద్రబాబుతో పాటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ బుద్ధప్రసాద్ కూడా హాజరు కానున్నారు. ఇక చిత్ర పరిశ్రమ నుంచి ఈ ఈవెంట్ కు ప్రముఖ దర్శకులు రాఘవేంద్ర రావు, ఎస్వీ కృష్ణారెడ్డి, తమ్మారెడ్డి భాదర్వాజ, నిర్మాత అశ్విని దత్ అతిథులుగా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో అలీని స్వర్ణ కంకణంతో ఘనంగా సత్కరించనున్నట్లు తెలుస్తోంది.

రాజకీయాలపై కన్ను

రాజకీయాలపై కన్ను

త్వరలో అలీ రాజకీయరంగ ప్రవేశం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వివిధ పార్టీల అధినేతలని కలసి ఇటీవల చర్చలు జరిగిపిన సంగతి తెలిసిందే. చంద్రబాబు, పవన్, జగన్ తో అలీ విడివిడిగా భేటీ అయ్యారు. త్వరలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఏదో ఒక పార్టీ తరుపున అలీ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X