Don't Miss!
- News
Leader: రూ. 100కే అందరికి బ్లూఫిల్మ్ చూపించిన గొప్ప లీడర్ ఆ మాజీ మంత్రి, అంతు చూస్తా, చాలెంజ్!
- Sports
పాపం సర్ఫరాజ్‌ఖాన్.. సెలెక్టర్ల బాక్స్ బద్దలు కొట్టినా ఎంపికవ్వలేదు: రవిచంద్రన్ అశ్విన్
- Lifestyle
సంబంధంలో సాన్నిహిత్యం, నమ్మకాన్ని పెంపొందించడానికి చిట్కాలు
- Finance
household income: భారతీయ కుటుంబాలపై సర్వే.. ఆదాయం, పొదుపులు ఎంతో తెలుసా ?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
బయటపడ్డ అవినాష్ బిగ్ బాస్ రెమ్యూనరేషన్.. అలా పుసుక్కున నోరుజారిన అలీ!!
కొన్ని విషయాలు ఎంత దాచి పెడదామన్నా కూడా దాచి పెట్టలేం. ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడోలా బయటకు వస్తూనే ఉంటుంది. పైగా రెమ్యూనరేష్ విషయాలు మాత్రం ఎక్కువ కాలం దాగవు. సన్నిహితుల దగ్గరో లేదా ఇంకెక్కడైనా చెప్పి ఉంటారు. అవి అలా అలా వ్యాప్తి చెందుతూ బయటకు వచ్చేస్తోంది. తాజాగా అవినాష్ బిగ్ బాస్ రెమ్యూనరేష్ కూడా అలా బయటకు వచ్చేసింది. ఎన్ని ఇంటర్వ్యూల్లో ఎన్ని రకాలుగా అడిగినా కూడా చెప్పలేదు అవినాష్.

పది లక్షలు కట్టి...
అవినాష్ బిగ్ బాస్ షోలోకి వెళ్లేందుకు మల్లెమాలకు పది లక్షలు కట్టాడు. అలా పది లక్షలు కట్టి అగ్రిమెంట్ నుంచి బయటకు వచ్చాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే అవినాష్‌కు మాత్రం పది లక్షల కంటే ఎక్కువగానే వచ్చి ఉంటాయని అందరూ అనుకుంటారు.

అన్ని ఇంటర్వ్యూల్లోనూ..
అవినాష్ ఇచ్చిన ప్రతీ ఇంటర్వ్యూల్లోనూ రెమ్యూనరేషన్‌కు సంబంధించిన ప్రశ్నలను అడిగారు. ఎక్కడా కూడా అవినాష్ నోరు జారలేదు. తెలివిగానే తప్పించుకున్నాడు. బాగానే వచ్చిందంటూ అనుకున్న దానికంటే ఎక్కువగానే వచ్చిందటూ చెప్పుకొచ్చాడు.

పది లక్షలు, అప్పు..
ఇక కొందరు అవినాష్ చేత రెమ్యూనరేషన్ చెప్పించే ప్రయత్నం చేసే భాగంలో వెరైటీ ప్రశ్నలు అడిగాడు. పది లక్షలు కట్టి వెళ్లారు.. కదా ఆ మొత్తం రిటర్న్ వచ్చేసిందా? మీకున్న మిగతా అప్పులు కూడా తీరిపోయాయా? అని అడిగారు. పది లక్షల కంటే ఎక్కువే వచ్చింది.. నాకున్న అప్పులు మొత్తం తీరిపోయాయ్ అని అవినాష్ సమాధానం ఇస్తూ వచ్చాడు.

వారాల చొప్పున..
మామూలుగా
బిగ్
బాస్
ఇంట్లో
వారాల
చొప్పున
రెమ్యూనరేష్
ఉంటుందని
తెలుస్తోంది.
అయితే
అవినాష్
వైల్డ్
కార్డ్
ఎంట్రీగా
మూడో
వారంలో
వచ్చాడు.
పదమూడో
వారం
వరకు
ఉన్నాడు.
టాప్
5లో
ఉండాల్సిన
కంటెస్టెంట్
కానీ
చేజేతులారా
నాశనం
చేసుకున్నాడు.
అయినా
కూడా
అతనికి
సరిపడా
డబ్బులు
వచ్చాయని
తెలుస్తోంది.

బయటపెట్టిన అలీ..
అలీ తాజాగా క్రాక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ బిగ్ బాస్ రెమ్యూనరేషన్ గురించి లీక్ చేశాడు. బిగ్ బాస్ ఇంట్లో మూడు నెలలు ఉంటే యాభై లక్షలు ఇస్తారట.. నేను మాత్రం నా ఇంట్లో తొమ్మిది నెలలు ఉన్నా ఐదు కోట్లు ఇవ్వాలి అంటూ కౌంటర్ వేశాడు. అలీ మాట్లాడిని స్పీచ్ అంతా ఒక లెక్క.. అవినాష్ రెమ్యూనరేషన్‌ను బయట పెట్టేయడం మరో లెక్క.