twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కమెడియన్ అలీకి డాక్టరేట్

    By Bojja Kumar
    |

    Comedian Ali
    హైదరాబాద్‌: తెలుగు ప్రేక్షకుల్ని గత మూడు దశాబ్దాలుగా నవ్వుల లోకంలో ముంచెత్తుతున్న ప్రముఖ హాస్య నటుడు అలీకి డాక్టరేట్ లభించింది.

    అలీ గురించిన వివరాల్లోకి వెళితే...బాల్యం నుంచీ కష్టాల కడలిలో ఈదిన అలీ సినిమాల్లోకి రావాలనే ఆశతో చిన్నతనంలోనే మద్రాసు వెళ్లి వేషాల వేటలో భారతీరాజా దృష్టిలో పడ్డాడు. 'సీతాకోక చిలుక'లో బాల నటుడు పాత్ర లభించడంతో 1980లో సినిమా లైఫ్‌ ప్రారంభం అయింది. బాల్యం నుంచి యవ్వనంలోకి ప్రవేశించే దశలో వేషాలు దొరకక ఇబ్బందులు పడ్డారు. చిన్న చిన్న పాత్రలు ధరించారు.

    రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రంలో చేటగా పాపులర్‌ అయ్యారు. అలీబాబా అరడజను దొంగలు పేరు తెచ్చింది. 'యమలీల' ద్వారా ఎస్వీ కృష్ణారెడ్డి ఇచ్చిన హీరో పాత్ర టర్నింగ్‌ పాయింట్‌ అయింది. అక్కుంబక్కుం, పిట్టలదొర, వినోదం, తొలి ప్రేమ, అమ్మయికోసం, హలో బ్రదర్‌, సందడే సందడి, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, ఇడియట్‌, ఆది, అమ్మాయి బాగుంది, నా అల్లుడు, హంగామా, దేశముదురు, సీమ శాస్త్రి, బొమ్మనా బ్రదర్స్‌ చందనా సిస్టర్స్‌ వంటి చిత్రాలు పేరు తెచ్చాయి.

    English summary
    Comedian Ali will be honored with a doctorate. ACADEMY OF UNIVERSAL GLOBAL PEACE will confer honorary doctorate to Ali on 25th May, 2013 at Coimbatore, Tamilnadu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X