హాస్య నటుడు ఆలీ రాజకీయాల్లో క్రియాశీలంగా...
హాస్య హీరో ఆలీ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించనున్నారు. ఇప్పటివరకూ సానుభూతిపరునిగా ఉన్న ఆయనకు పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర కల్పించాలని టిడిపి అధినాయకత్వం భావిస్తోంది. ఈ నెలాఖరులో నిర్వహించనున్న మహానాడు నిర్వహణ కమిటీలో ఆయనకూ చోటు కల్పించారు. ఈ కమిటీలను శనివారం ఇక్కడ ప్రకటించారు. మహానాడు సాంస్కృతిక కార్యక్రమాల కమిటీలో ఆయనను వేశారు. ఈ కమిటీలో ఆయనతోపాటు సినీ నటులు బాబూ మోహన్, ఎవిఎస్, వేణుమాధవ్, కవిత కూడా ఉన్నారు.
వీరిలో వేణుమాధవ్, ఆలీ మినహా మిగిలిన వారంతా ఇప్పటికే పార్టీలో క్రియాశీలంగా ఉన్నవారే. వేణుమాధవ్ పోయిన ఎన్నికల్లో కోదాడ అసెంబ్లీ సీటును కోరారు. కాని ఆయనకు అప్పుడు అవకాశం రాలేదు. ఆలీ గతంలో చాలా కాలం క్రితం ఒకసారి టిడిపి తరపున ప్రచారం చేశారు. ఇటీవలి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆయనను జూబిలీ హిల్స్ పరిసర ప్రాంతాల్లో నిలపాలన్న ప్రతిపాదన కూడా వచ్చింది. కాని ఆయన ముందే అంగీకరించిన సినిమాల షూటింగులు ఉండటంతో పోటీకి రాలేకపోయారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గోదావరి జిల్లాల్లో ఎక్కడైనా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలన్న ఆలోచనలో ఆయన ఉన్నారని టిడిపి వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











