For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవన్‌తో విభేదాలపై అలీ షాకింగ్ కామెంట్స్: మీటింగ్‌లో తిట్టింది అందుకే.. వాళ్ల వల్లే ఆరోజు అలా అంటూ!

  |

  టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎంతో రిజర్వుడ్‌గా ఉంటాడన్న విషయం తెలిసిందే. అందుకే ఆయన ఎవరితోనూ పెద్దగా కలిసి ఉన్నట్లు కనిపించడు. చాలా తక్కువ మందితోనే ఈ మెగా హీరో స్నేహం చేస్తుంటాడు. అందులో సీనియర్ కమెడియన్ అలీ ఒకరు. చాలా కాలంగా ఎంతో స్నేహంగా ఉంటోన్న వీళ్లిద్దరి మధ్య కొంత గ్యాప్ వచ్చిన విషయం తెలిసిందే. ఆ పరిస్థితి తలెత్తడానికి కారణం రాజకీయాలే అని కూడా తెలుసు. తాజాగా దీనిపై అలీ స్పందించారు. పవన్ తనపై చేసిన వ్యాఖ్యల గురించి ప్రస్తావిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ వివరాలు మీకోసం!

  అలా కలిసిన పవన్ కల్యాణ్ అలీ

  అలా కలిసిన పవన్ కల్యాణ్ అలీ

  ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నటించిన చిత్రం ‘గోకులంలో సీత'. ఈ సినిమాలో కమెడియన్ అలీ ముఖ్యమైన పాత్రను పోషించాడు. అప్పటి నుంచి వీళ్లిద్దరి మధ్య స్నేహం మొదలైంది. దీని తర్వాత వీళ్లిద్దరూ ఎంతో క్లోజ్ అయిపోయారు. ఇక, అప్పటి నుంచి చాలా కాలం పాటు ఎన్నో సినిమాలకు కలిసి పని చేయడంతో పాటు ఒకే ఫ్యామిలీలా కలిసి మెలిసి ఉన్నారు.

  ఆయన లేకుండా సినిమా లేదు

  ఆయన లేకుండా సినిమా లేదు

  పవన్ కల్యాణ్.. అలీ మధ్య ఎలాంటి రిలేషన్ రోజు రోజుకూ బలపడుతూనే వచ్చింది. దీంతో వీళ్లిద్దరి గురించి టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున చర్చలు కూడా జరిగేవి. అంతేకాదు, అలీకి క్యారెక్టర్ లేకపోతే ఆ సినిమానే చేయనని పవన్ చెప్పేంతగా ఈ ఇద్దరూ క్లోజ్ అయ్యారు. అందుకే పవర్ స్టార్ ఇప్పటి వరకూ నటించిన దాదాపు అన్ని సినిమాల్లోనూ ఆయనకు మంచి మంచి పాత్రలు పడ్డాయి.

  పవన్‌ను కాదని... ఆ పార్టీలోకి

  పవన్‌ను కాదని... ఆ పార్టీలోకి

  కొన్నేళ్ల క్రితం పవన్ కల్యాణ్ జనసేన అనే రాజకీయ పార్టీని ప్రారంభించిన విషయం తెలిసిందే. 2019 ఎన్నికలకు ముందు ఆయన వైపు విపరీతమైన గాలి వీచింది. దీంతో రాజకీయాల వైపు అడుగు వేస్తోన్న కమెడియన్ అలీ ఆ పార్టీలో చేరడం ఖాయం అని అంతా అనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కల్యాణ్‌ను కాదని.. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నాడు.

  అలీపై పవన్ కల్యాణ్ కామెంట్స్

  అలీపై పవన్ కల్యాణ్ కామెంట్స్

  2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ రోడ్‌ షోలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ‘అలీ నా స్నేహితుడు. అతడు పరిచయం చేసిన వాళ్ళ బంధువుకు నరసారావు పేట ఎంపీ టికెట్ ఇచ్చా. కానీ వారు మాత్రం నన్ను వాడుకుని వదిలేశారు. ఇదేనా స్నేహమంటే అలీ. అందుకే నేను స్నేహితులని, బంధువులని ఎక్కువగా నమ్మడం మానేశా' అంటూ అలీపై సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు.

  పవన్‌ వ్యాఖ్యలపై అలీ కామ్‌గా

  పవన్‌ వ్యాఖ్యలపై అలీ కామ్‌గా

  పవన్ కల్యాణ్ తనపై చేసిన వ్యాఖ్యలకు అలీ అంతగా రియాక్ట్ అవలేదు. ఆ వెంటనే ఓ మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘నన్ను పవన్ కల్యాణ్ గారు ఎప్పుడూ జనసేనలోకి రమ్మని ఆహ్వానించలేదు. అలాంటప్పుడు ఆ పార్టీలోకి నేనెలా వెళ్తాను. ఏ పార్టీలో ఉన్నా పవన్ కల్యాణ్ ఎప్పుడూ బాగుండాలని కోరుకునే వ్యక్తుల్లో నేను మొదటి వాడిగా ఉంటా' అని చెప్పుకొచ్చారు.

  విభేదాలపై క్లారిటీ ఇచ్చిన అలీ

  విభేదాలపై క్లారిటీ ఇచ్చిన అలీ

  ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అలీ.. పవన్ కల్యాణ్‌తో దూరం వచ్చిన విషయం నిజమేనని.. అయితే, అది కేవలం రాజకీయాల వరకేనని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఆయనతో కలిసి సినిమా కూడా చేస్తానని ప్రకటించారు. దీంతో వీళ్లిద్దరి మధ్య మళ్లీ పాత స్నేహం కనిపిస్తుందన్న టాక్ వినిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా తమ వివాదంపై అలీ షాకింగ్ కామెంట్స్ చేశారు.

  Ananya Nagallla Is The New Super Star Says Play Back Director | Filmibeat Telugu
  వాళ్ల వల్లే ఆరోజు అలా మాట్లాడి

  వాళ్ల వల్లే ఆరోజు అలా మాట్లాడి

  తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అలీ.. ‘పవన్‌కు నాకు మధ్య శత్రుత్వం ఏమీ లేదు. ఆరోజు ఎవరో చెప్పడం వల్లే ఆయన నన్ను విమర్శించారు. స్వతహాగా ఆయనైతే నన్ను ఏమీ అనరన్న నమ్మకం ఉంది. అయినా దాని వల్ల నేనేమీ ఫీల్ అవలేదు. ఫ్రెండ్‌షిప్ అన్నాక ఇలాంటివి కామన్. రాజకీయాల పరంగా ఇలా జరిగింది కానీ.. కావాలని చేసింది ఏమీ లేదు' అని వివరించారు.

  English summary
  Tollywood Senior Comedian Ali Likes Pawan Kalyan Very Much. But Recent Time Small Gap Entered Between These Two Stars. Now Comedian Ali Clarified about This.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X