కమెడియన్ ఆలీకి మాతృవియోగం.. విషాదంలో సినీ లోకం
ఈ మాద్యకాలంలో తెలుగు సినీ పరిశ్రమలో పలు విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతిరావు మరణం సినీ లోకంలో విషాదం నింపగా, ఈ విషయం మరవకముందే కమెడియన్ ఆలీ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి పోతే..

ఆలీకి మాతృవియోగం
కమెడియన్ ఆలీ తల్లి జైతున్ బీబీ మరణించారు. గత కొంతకాలంగా తీవ్ర ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆమె రాజమహేంద్రవరంలోని తన స్వగృహంలో కన్నుమూశారు. ఆలీ తల్లి మరణవార్త తెలిసి సినీ పరిశ్రమలోని ఆయన సన్నిహిత వర్గాలు కలత చెందాయి.

హుటాహుటిన ఆలీ రాక..
ప్రస్తుతం ఆలీ ఓ షూటింగ్ నిమిత్తం రాంచీ వెళ్లారు. అక్కడ షూటింగ్‌లో పాల్గొంటున్న ఆయనకు ఈ వార్త తెలిసి హుటాహుటిన హైదరాబాద్ బయలు దేరారు. మరోవైపు ఆలీ తల్లి జైతున్ బీబీ భౌతికకాయాన్ని కూడా రాజమండ్రి నుంచి హైదరాబాద్ తీసుకొచ్చేనందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

హైదరాబాద్‌లోనే అంత్యక్రియలు
గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోనే ఆలీ తల్లి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. ఆలీకి తన తల్లిదండ్రులంటే చాలా ప్రేమ ఉండేది. పలు సందర్భాల్లో తన ఉన్నతి తల్లిదండ్రులే ప్రధాన కారణమని కూడా ఆలీ తెలిపారు.

సినీ ప్రముఖుల సంతాపం
కమెడియన్ ఆలీ తల్లి మరణ వార్త తెలుసుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖలు తమ తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆలీకి ధైర్యం చెబుతూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











