»   » అందుకే అలీ షో ఆగి పోయిందా? ఇకనైనా మారుతాడా?

అందుకే అలీ షో ఆగి పోయిందా? ఇకనైనా మారుతాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కమెడియన్ అలీ సినిమాల్లో నటిస్తుండటంతో పాటు కొన్ని టీవీ షోలు కూడా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అలీ హోస్ట్ చేస్తున్న 'ఆలీతో జాలీగా' షోకు అప్పట్లో మంచి గుర్తింపే వచ్చింది. కానీ ఇపుడు ఈ షో ఆగి పోయింనట్లు సమాచారం.

మొదట్లో ఈ షో బాగా పాపులర్ అయి మంచి రేటింగుతో సాధించింది. అయితే ఈ షో రేటింగ్ దారుణంగా పడిపోవడంతో ఆపేసినట్లు తెలుస్తోంది. ఈ షో ఇంత ప్లాప్ అవ్వ‌డానికి కారణం ఈ షోలో ఆలీ మాట్లాడే తీరులో బూతు కోణం కనిపించడం, డ‌బుల్ మీనింగ్ డైలాగులే అన్న టాక్ వినిపిస్తోంది.

Comedian Ali show 'Alitho Jollygaa' controversy

బుల్లితెర షోలంటే ఎక్కువగా ఫ్యామిలీ మొత్తం కలిసి చూస్తారు. అయితే అలీ తీరుతో కుటుంబంతో కలిసి చూసే చాలా మంది డబుల్ మీనింగ్ డైలాగుల బూతు గోల తట్టుకోలేక షో చూడటం మానేసారని అంటున్నారు. దీంతో షో రేటింగ్ క్రమక్రమంగా తగ్గుముఖం పట్టిందట.

బుల్లితెరపై మాత్రమే కాదు... కొన్ని ఆడియో ఫంక్షన్లలో కూడా అలీ ఇలానే బూతును తలపించేలా డబుల్ మీనింగ్ డైలాగులు, హీరోయిన్ల మీద అడల్ట్ జోకులు వేసి విమర్శల పాలైన సంగతి తెలిసిందే. అయితే అలీ ఇకనైనా తన ప్రవర్తనలో మార్పు తెచ్చుకుని....ద్వందార్థాలకు స్థానం లేకుండా ఫ్యామిలీ మొత్తం కలిసి ఎంజాయ్ చేసేలా షో నిర్వహిస్తే బావుంటుందని, బూతు, డబల్ మీనింగ్ కాన్సెప్టును వదిలేసి కొత్త కాన్సెప్టుతో షో మొదలు పెడితే బాగానే నడుస్తుందని అంటున్నారు.

English summary
Comedian Ali show 'Alitho Jollygaa' controversy in talk.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu