ఇలియానాపై మండిపడ్డ కమిడియన్ అలీ
హైదరాబాద్ : స్టార్ కమిడియన్ అలీ ముంబై హీరోయిన్స్ ని ముఖ్యంగా ఇలియానా పై మండిపడ్డారు. రెమ్యునేషన్ తీసుకోవటంలో ముందుండే వారు ప్రమోషన్ వంటి విషయాల్లో తెలుగు పరిశ్రమని నిర్లక్ష్యం చేస్తారని ఆయన విమర్శించారు. మిస్ హైదరాబాద్ షో కు గెస్ట్ గా హాజరైన ఆయన మాట్లాడుతూ లోకల్ ట్యాలెంట్ ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం చాలా ఉందన్నారు. ముంబై నుంచి హీరోయిన్స్ ని ఇంపోర్ట్ చేసుకుని వారికి కోటి రూపాయల ప్యాకేజీలు ఇస్తున్నామని, వాటికన్నా పాతిక లక్షలు ఇచ్చి ఎంకరేజ్ చేస్తే సౌత్ లో అంతకన్నా మంచి హీరోయిన్స్ దొరుకుతారన్నారు.
అలాగే రీసెంట్ గా జులాయి ప్రమోషన్ కి రాకుండా ఎగ్గొట్టిన ఇలియానా, బర్భీ ప్రమోషన్ కి దేశం మొత్తం తిరిగిన విషయం గుర్తు చేసారు. ఆయన మాట్లాడుతూ..." మాకు తెలుసు వారు ముంబై లో ఈ హీరోయిన్స్ జీవితాలు ఎలా గడుపుతారో. వారు అక్కడ లోకల్ ట్రైన్స్ లో వెళతారు. ఆటో రిక్షాల్లో తిరుగుతారు. సింగిల్ బెడ్ రూమ్స్ లో జీవితం గడుపుతారు. కానీ ఇక్కడకి వచ్చేసరకి ఫైవ్ స్టార్ హోటల్స్ రూమ్స్ కావాలని డిమాండ్ చేస్తారు. ఖరీదైన కార్స్ తప్ప ఎక్కరు." అన్నారు.
అలాగే ...."అంతెందుకు బర్ఫీ నిర్మాతలు ఇలియాను తీసుకునేటప్పుడే పదిహేను రోజులు పాటు ప్రమోషన్ లో పాల్గొనాలి అని ఖర్చితంగా చెప్పి తీసుకున్నారు. లేకపోతే వేరే హీరోయిన్ నీ తీసుకుంటామన్నారు. అదే తెలుగుకి వచ్చేసరికి ఇలియానా నటించటం మాత్రమే తమ భాధ్యత అన్నట్లుగా బిహేవ్ చేస్తోంది. ఆమె ప్రమోషన్ కి రాదు. ఓ హీరోయిన్ ముందుకు వచ్చి టీవీల్లో ప్రమోషన్ చేస్తే ఆ సినిమాకు ఎంతో ప్రమోషన్ లభిస్తుంది. ఆ మాత్రం కూడా ఈ ముంబై హీరోయిన్స్ చేయటం లేదు ," అని ఆయన కోపంగా ఆవేదన వెళ్లబుచ్చారు.


Click it and Unblock the Notifications











