తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన హాస్య నటుడు ఏవీఎస్ ఆరోగ్యం నిలకడగా ఉందని గ్లోబల్ ఆసుపత్రి వైద్యులు,కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన కోలుకుంటున్నారని, ఆందోళన పడనవసరం లేదని ఆయన కుమారుడు ప్రదీప్, భార్య ఆశ మీడీయా తో చెప్పారు. ఆయన కొంతకాలంగా లివర్ సిర్రోసిస్ అనే కాలేయ వ్యాధితో బాధపడుతున్నారు. గతంలోను చికిత్స చేసుకున్న ఆయన శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో గ్లోబల్ ఆసుపత్రిలో చేరారు. ఆయనను ఇంటిన్సిటీ కేర్‌లో ఉంచారు. షూటింగ్ లో కలుషిత వాటర్ త్రాగారని అందుకే అనారోగ్యం వచ్చిందని అందరూ అభిప్రాయపడుతున్నారు.
Story first published: Sunday, May 17, 2026, 19:05 [IST]