ఇదీ తెలుగు సినీ మాఫియా

తెలుగు సినిమా ప్రపంచం పూర్తిగా మాఫియాల ఆధీనంలో పని చేస్తూ చిన్న సినిమా నిర్మాతలను బజారు పాలుచేస్తున్నారని మాజీ మంత్రి, ప్రముఖ హాస్యనటుడు బాబూమోహన్ ధ్వజ మెత్తారు. ఆయన తనయుడు హీరోగా నిర్మించిన సమ్మక్క సారక్క మహాత్మ్యం సినిమా ప్రింట్లను డిస్ట్రిబ్యూటర్‌ల ద్వారా విడుదల చేశామని కాగా ప్రింట్లు ఏ థియేటర్‌లో ఆడుతున్నాయో తమకు సమాచారం ఇవ్వకుండా థియేటర్ యాజమాన్యాలు అక్రమంగా సినిమాలు నడుపుతూ తమ లాంటి చిన్న నిర్మాతల నడ్డివిరుస్తున్నారని ఆరోపించారు.
బడా ప్రొడ్యూసర్‌లదే హవా చిన్న నిర్మాతలకు దిక్కు దివాణం లేదు తెలుగు సినిమా రంగం ప్రస్తుతం పెద్ద సం క్షోభంలో చిక్కుకుని ఊగిసలాడుతున్నదని బాబూమోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా ఇండస్ట్రీలో తాను అనేక ఏళ్లుగా సేవలందిస్తునప్పటికి ఇండస్ట్రీ గురించి తెలిసింది చా లా తక్కువేనన్నారు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, సురేష్‌బాబు, దాసరి నారాయణరావు, రామోజీరావుల కనుసన్నలలో వేలాది థియేటర్‌లు నడుస్తున్నాయని, వారు జోక్యం చేసుకుంటే తప్ప సినిమాలు ఆడే పరిస్థితి లే దన్నారు.
సినిమారంగంలో బయ్యర్లు, బ్రో కర్లు, దళారులదే రాజ్యమని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం సినిమా ప్రొడ్యూసర్ ముళ్లకంచలో చిక్కుకున్నాడన్నారు. ప్రముఖ నటులు అక్కినేని, ఎన్టీఆర్‌లు సినీ పరిశ్రమను కుటుంబం లా అభివర్ణించేవారని గత కాలాన్ని గుర్తు చే సుకున్నారు. ప్రభుత్వం కల్పించుకుని సంక్షోభంలో ఉన్న సినీ పరిశ్రమను ఆదుకుని వే లాది మందికి ఉపాధి కల్పించాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.
అంతే కాకుండా దా సరి నారాయణరావు తదితరులు కళ్లు మూ సుకుంటే లాభం లేదని సినీలోకాన్ని నిర్లిప్తతలోకి నెట్టకుండా ఆదుకోవాలని కోరారు. థియేటర్‌లు ప్రొడ్యుసర్ కౌన్సిల్ నియంత్రణలో ఉండాలని కోరారు. బాధిత నిర్మాతలందరికీ అండగా ఉంటాను... వారి కోసం మ హోద్యమాన్ని చేపట్టానంటూ గద్గద స్వరం తో తెలిపారు.


Click it and Unblock the Notifications











