మరోసారి తన టాలెంట్‌తో ఆకట్టుకున్న బ్రహ్మానందం.. రామాంజనేయుల ఎమోషనల్ మూమెంట్!

టాలీవుడ్ సీనియర్ మోస్ట్ కమెడియన్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఆర్టిస్ట్ బ్రహ్మానందం గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. వెండితెరపై మూడు తరాల జనరేషన్స్ నవ్వించారు. ఇంకా నవ్విస్తూనే ఉన్నారు. కరోనా వైరస్ కారణంగా వెండితెరపై కనిపించక పోయినా కూడా బ్రహ్మానందం ఏ మాత్రం ఖాళీగా కూర్చోవడం లేదు. తనకు ఇష్టమైన డ్రాయింగ్ కళతో జనాలను ఆకర్షిస్తున్నారు.

బ్రహ్మానందంలో ఇంత టాలెంట్ ఉందా?

బ్రహ్మానందంలో ఇంత టాలెంట్ ఉందా?

లాక్ డోన్ ముందు వరకు కూడా అసలు బ్రహ్మానందంలో ఇంత టాలెంట్ ఉందని ఎక్కువమందికి తెలియదు. తెరపై అమాయకంగా, వెర్రితనంగా నవ్వించే బ్రహ్మి నిజం జీవితంలో ఇంత గొప్ప చిత్ర కళాకారుడా అనే విషయం చాలా వరకు ఆశ్చర్యన్ని కలిగించింది. అదే విధంగా బ్రహ్మానందం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాడు.

అసలు టాలెంట్ ని బయటపెడుతున్నారు.

అసలు టాలెంట్ ని బయటపెడుతున్నారు.

ఇంట్లో సెలబ్రెటీస్ చాలా వరకు వివిధ రకాల సినిమాలు చూస్తూ కాలాన్ని గడిపేస్తున్నారు. మరికొందరు ఎదో ఒక ఛాలెంజ్ విసురుకుంటూ నెటిజన్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్నారు. ఇక చాలా మంది మళ్ళీ ఇంత పెద్ద హాలీ డేస్ మరోసారి రావేమో అని నిమిషం కూడా వృధా చేయకుండా కుటుంబ సభ్యులతో కాలాన్ని గడిపేస్తున్నారు. కానీ బ్రహ్మానందం లాంటి వాళ్ళు మాత్రం వారిలో మొదటి నుంచి దాగి ఉన్న అసలు టాలెంట్ ని బయటపెడుతున్నారు.

 రామ మందిరం భూమి పూజ నేపథ్యంలో

రామ మందిరం భూమి పూజ నేపథ్యంలో

ఆ మధ్య మదర్ థెరిస్సా బొమ్మ గీసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేసిన బ్రహ్మానందం ఇప్పుడు అయోధ్య రామ మందిరం భూమి పూజ నేపథ్యంలో అందరిని ఆకర్షించేలా అద్భుతమైన చిత్రాన్ని గీశారు. రాముడిని ఆంజనేయ స్వామి హద్దుకొని ఉన్నట్లు ఉన్న ఆ ఫోటో జనాలను అమితంగా ఆకర్షిస్తోంది.

Recommended Video

Brahmanandam Hails Allu Arjun & Trivikram At Ala Vaikunthapurramuloo Success Meet
 ఆంజనేయుని ఆనంద బాష్పాలు

ఆంజనేయుని ఆనంద బాష్పాలు

రామాలయ నిర్మాణం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నదని అందుకు ఆంజనేయ స్వామికి కూడా భావోద్వేగంతో ఆనందభాష్పాలు వస్తున్నాయని బ్రహ్మానందం గీసిన బొమ్మ ఎంతో అందంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆంజనేయుని ఆనంద బాష్పాలు అనే పేరుతో ఒక పెన్సిల్ బొమ్మ ద్వారా తన టాలెంట్ ఏంటో మరోసారి నీరూపించారు బ్రహ్మానందం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X